
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మూడవ రోజు కూడా కొనసాగుతోంది.
తొలి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 5,110 ఓట్ల ఆధిక్యం లభించింది. తొలి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 75,675 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 70,565 ఓట్లు వచ్చాయి. ఇంకా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 60,419 ఓట్లు వచ్చాయి.
తొలి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 5,110 ఓట్ల ఆధిక్యం లభించింది. తొలి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 75,675 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 70,565 ఓట్లు వచ్చాయి. ఇంకా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 60,419 ఓట్లు వచ్చాయి.
మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరు కనీసం 50 శాతం ఓట్లకు చేరకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లు ఫలితాన్ని తేల్చనున్నాయి. పట్టబద్రులు 2,52,007 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, 27,671 ఓట్లు చెల్లకుండా పోయాయి. 2,24,336 ఓట్లు చెల్లడంతో అధికారులు 1,12,169 ఓట్లను కోటాగా ప్రకటించారు.
మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలక పోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఎలిమినేషన్ ద్వారా ఇప్పటివరకు 23 మందిని పోటీ నుంచి తొలగించారు. మొత్తం పట్టభద్రుల ఎన్నిక కోసం 56మంది పోటీలో ఉండగా 53 మందికి కలిపి కేవలం 17,244 ఓట్లు మాత్రమే రావడం వల్ల వారి ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయినా ఫలితం వెలువడదు.
దీంతో మూడో స్థానంలో ఉన్న ప్రసన్న హరికృష్ణకు పడ్డ రెండో ప్రాధాన్యత ఓట్లు ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాన్ని తేల్చనున్నాయి. రెండో ప్రాధాన్యత ఓట్లలో అధిక మొత్తం ప్రసన్న హరికృష్ణకు వేసినట్లు అధికారులు గుర్తించారు అయితే ఆయన మూడో స్థానం ఉండడం వల్ల ఆయన కూడా ఎలిమినేట్ అవుతారు. తుది ఫలితం ప్రసన్న హరిప్రసాద్ కు పడ్డ రెండో ప్రాధాన్యత ఓట్లతో తేలనుంది. ప్రసన్న హరికృష్ణకు పడ్డ రెండవ ప్రాధాన్యత ఓట్లు బీజేపీకి పడితే అంజిరెడ్డి, కాంగ్రెస్ కు పడితే నరేందర్ రెడ్డి గెలిచే అవకాశాలున్నాయి.
More Stories
సందడిగా దత్తాత్రేయ `అలయ్ బలయ్’
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం