తాజాగా, రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో అమ్మాయిలు జుట్టు ముడి వేసుకోవడానికి వాడే హెయిర్ క్లిప్ డ్రైవింగ్ సమయంలో ఎలా ప్రమాదం తెచ్చిపెడుతుందో చూపించింది.
ఈ క్లిప్ వెనుక సీట్‌కి తగిలి తలలోకి చొచ్చుకుపోయే ప్రమాదం ఉన్నదనీ, కాబట్టి కారు నడిపేటప్పుడు ఇలాంటివి ధరించవద్దని ఆమె కోరింది. ‘చిన్నచిన్న యాక్ససరీలే పెద్ద అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కారు ప్రమాదం జరిగినప్పుడు మరింత నష్టం చేస్తాయి. రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకొని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటివి ఉపయోగించకుండా ఉండటమే మంచిది’ అంటూ చెప్పుకొచ్చింది.
మృణాల్ పెట్టిన పోస్ట్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తున్నది. హిందీ సీరియల్స్‌లో మెరిసిన మృణాల్ ఠాకూర్ హనూ రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’తో టాలీవుడ్‌కు పరిచయమైంది.

More Stories
సుప్రీంకోర్టుకు రాహుల్ యాత్రపై సిజెఐ సీరియస్
దేశం వీడాలని బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు
భారత్ లో బలమైన ఆర్థిక సంబంధాలకు కెనడా ఆసక్తి