భారత ఆర్థిక వ్యవస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో జిడిపి వృద్ధి 6.2 శాతంగా నమోదైంది. ఇది గత త్రైమాసికం (జూలై-సెప్టెంబర్) 5.6 శాతం కంటే మెరుగ్గా ఉండటంతో, భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ముందుకు సాగుతోందని సూచిస్తోంది.
అయితే ఆర్‌బిఐ ఈ త్రైమాసికంలో 6.8 శాతం మేర జిడిపి వృద్ధి రేటు నమోదు కావొచ్చని అంచనా వేసింది. ఆర్‌బిఐ అంచనా కంటే తక్కువగానే జిడిపి నమోదైంది. ఇక 2024-25 సంవత్సరానికి వాస్తవ జిడిపి వృద్ధి రేటు 6.6 శాతం మేర నమోదు కావొచ్చని ఆర్‌బిఐ అంచనా వేసింది. జనవరి – మార్చి త్రైమాసికంలో 7.2 శాతం జిడిపి వృద్ధి చెందుతుందని ఆర్‌బిఐ అంచనా వేసింది.
ఎన్ఎస్ఓ జనవరి 2025లో విడుదల చేసిన ప్రాధమిక అంచనాల ప్రకారం 2024-25 సంవత్సరానికి జిడిపి వృద్ధి 6.4 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. తాజా అంచనాలో దీనిని 6.5 శాతానికి పెంచింది. జిడిపి వృద్ధికి ప్రధానంగా కొన్ని అంశాలు సహకరించాయని భావిస్తున్నారు. ప్రభుత్వ పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు; ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై భారీగా ఖర్చు చేయడం, రోడ్లు, రైల్వే, మెట్రో ప్రాజెక్టులు, ఎయిర్ పోర్టుల నిర్మాణం వేగంగా సాగడంగా గుర్తించారు.
అదేవిధంగా, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చాయి. పట్టణ ప్రజల ఆదాయంలో పెరుగుదలతో వినియోగం పెరిగింది. ఈ-కామర్స్, ఆటోమొబైల్, గృహ వినియోగ వస్తువుల రంగాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు, జీతాల పెంపుతో కొనుగోలు సామర్థ్యం పెరిగింది. సేవల రంగం భారతదేశ జిడిపిలో ప్రధాన భాగం కావడం, టూరిజం, హాస్పిటాలిటీ, ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో అభివృద్ధి దోహదపడ్డాయి.
ఆన్‌లైన్ సేవలు, ఫ్రీలాన్స్ మార్కెట్, స్టార్టప్ ఎకోసిస్టమ్ కూడా సేవల రంగాన్ని బలోపేతం చేశాయి. భారతదేశం టెక్స్‌టైల్, ఫార్మా, ఇంజనీరింగ్ వస్తువులు, ఐటీ సేవలను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తుండటం, గ్లోబల్ డిమాండ్ పెరగడం, మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలు ఎగుమతులకు సహాయపడ్డాయి.
మరోవంక, అమెరికా, ఐరోపా యూనియన్ ఆర్ధిక వయ్వస్థల అనిశ్చిత స్థితి భారత ఎగుమతులపై కొంత ప్రభావం చూపింది. చైనాలో మందగమనం భారతదేశ పరిశ్రమలకు కొంత ప్రేరణ ఇచ్చింది. అయితే సరఫరా గొలుసు సమస్యలు ఉనికిలో ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య సంఘర్షణలు, చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగింది.
ఇక భవిష్యత్ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ ), మౌలిక సదుపాయాల నిధులు వంటి ప్రభుత్వ విధానాలు వృద్ధికి సహాయపడతాయని భావిస్తున్నారు. పెరుగుతున్న స్టార్టప్‌ల సంఖ్య భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశనిస్తుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డిఐ) భారతీయ పరిశ్రమల వృద్ధికి తోడ్పడతాయని అంచనా వేస్తున్నారు. కాగా,
ఇలా ఉండగా, ధరల స్థిరత్వం సాధించడం అత్యంత కీలకం కాగలదు. బ్యాంకింగ్ రంగం ఆరోగ్యంగా ఉండడం కీలకం అవుతుంది. తయారీ రంగం మరింత బలోపేతం కావాలి. 2024-25లో భారతదేశ జిడిపి వృద్ధి 6.5% స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వ్యయం, సేవల రంగం, ఎగుమతుల పెరుగుదల ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా మారతాయి.
సబ్సిడీలు, ప్రభుత్వ వ్యయ నియంత్రణ, సరైన విధానాల ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం అవసరం. భారత ఆర్థిక వ్యవస్థ 2024-25లో స్థిరంగా ముందుకు సాగుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పెట్టుబడులు, వినియోగంలో పెరుగుదలతో భారత్ ప్రపంచంలో అతిపెద్ద , వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలవనుంది.

More Stories
తేజస్వీ సీఎం అయితే కిడ్నాపింగ్, వసూళ్లు, హత్య మంత్రిత్వ శాఖలు
సమాజం ఆర్ఎస్ఎస్ ను ఆమోదించింది.. వ్యక్తులు నిషేధింపలేరు
జూబ్లీ హిల్స్ లో బిజెపి ప్రయత్నాలు ముమ్మరం చేయాలి