
సరస్వతి పవర్ లో షేర్ల బదిలీకి సంబంధించి కొడుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కోడలు వైఎస్ భారతి చేసిన ఆరోపణలను ఖండిస్తూ వైఎస్ విజయమ్మ, ఆమె వైఎస్ భారతి జాతీయ కంపెనీ చట్ట ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) విడివిడిగా పిటీషన్లు దాఖలు చేశారు.
‘నా కుమారుడు జగన్, కోడలు భారతి చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాను. నా పిల్లల మధ్య వివాదం కారణంగా నేను కోర్టు గదిలో నిలబడాల్సి రావడం తీవ్రంగా కలచివేస్తోంది. బాధాతప్త హృదయంతో కౌంటర్ దాఖలు చేస్తున్నాను. జగన్, భారతి పేర్కొంటున్న విషయాలు నిరాధారం, సదరు ఆరోపణలు న్యాయసమీక్షకు నిలువవు’ అని వైఎస్ విజయలక్ష్మి పేర్కొన్నారు.
కంపెనీ వాటాలను చట్టబద్ధంగా బహుమతిగా ఇస్తూ చేసుకున్న కుటుంబ ఒప్పందంలో ఎన్‌సీఎల్‌టీ జోక్యం చేసుకోజాలదని ఆమె, షర్మిలారెడ్డి స్పష్టం చేశారు. కుటుంభం వివాదాలలో జోక్యం చేసుకునే అధికారం దానికి లేదని తెలిపారు. కుటుంబ వివాద పరిష్కారాలు ట్రైబ్యునల్ పరిధిలోకి రావని పేర్కొన్నారు.
తనకు తెలియకుండా సరస్వతి పవర్ షేర్లను తన తల్లి, చెల్లి బదిలీ చేసుకున్నారని, సదరు బదిలీని రద్దు చేసి తన పేరిట, తన భార్య భారతి, తమ కంపెనీ క్లాసిక్ రియాల్టీ పేరిట 51.01 శాతం వాటాలు యథావిధిగా కొనసాగేలా ఆదేశాలివ్వాలని పేర్కొంటూ జగన్ ఎన్‌సీఎల్‌టీలో గతంలో పిటిషన్ వేశారు. ఆ షేర్లను తన తల్లికి గిఫ్టుగా ఇచ్చానని, వాటిని తాను ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చని అందులో పేర్కొన్నారు.
సరస్వతి పవర్ ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తాను గిఫ్ట్‌గా ఇచ్చిన షేర్లను షర్మిలకు బదలాయించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఈ షేర్ల బదలాయింపును అడ్డుకోవాలని కోరారు. అయితే రాజకీయ ఉద్దేశాలు, కారణాలతోనే జగన్ ఎన్‌సీఎల్‌టీలో తప్పుడు కేసు వేశారని విజయలక్ష్మి, షర్మిల ఆరోపించారు.
2019 ఆగస్టు 31వ తేదీన కుటుంబం మధ్య జరిగిన ‘మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్(ఎంవోయూ)’ మేరకే సరస్వతి పవర్ షేర్ల బదలాయింపు జరిగిందని, షేర్ల బదలాయింపు అంతా చట్టప్రకారమే జరిగిందని వెల్లడించారు. ఎన్‌సీఎల్‌టీని తప్పుదారి పట్టించేలా జగన్ రాజకీయ ప్రేరిత వ్యాజ్యం వేశారని తల్లీ కుమార్తెలు పేర్కొన్నారు.
కాగా జగన్ పిటిషన్‌పై ఎన్‌సీఎల్‌టీ సోమవారం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ట్రైబ్యునల్ తదుపరి విచారణను మార్చి 6కు వాయిదా వేసింది.
More Stories
తిరుమలలో హిందువులు మాత్రమే పనిచేయాలి
అసెంబ్లీకి దొంగల్లా వచ్చి వెళ్లడం ఏంటి?
ఎపి ప్రభుత్వ సలహాదారులుగా సతీష్రెడ్డి, సుచిత్ర ఎల్ల