
ఇక మే 13న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు దేశాధినేతలు చర్చించనున్నారు. వివిధ దేశాలపై ట్రంప్ టారిఫ్‌లు విధిస్తున్న నేపథ్యంలో ఇరువురి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అదే విధంగా భారత్‌కు అక్రమ వలసదారుల తరలింపు విధానం కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అమెరికా అధ్యక్షుడిని వచ్చేవారంలో కలుసుకునేందుకు మోదీని ఆహ్వానించినట్టు వైట్‌హౌస్ ప్రతినిధి ఒకరు ఇటీల ప్రకటించిన క్రమంలో మోదీ పర్యటన తేదీలు ఖరారయ్యారు. భారత ప్రధానమంత్రికి తాను ఆతిథ్యం ఇవ్వనున్నట్టు ట్రంప్ గత నెలలో ప్రకటించారు.
”చాలాకాలం తర్వాత ఈరోజు ఉదయం ఫోనులో మాట్లాడాను. బహుశా ఫిబ్రవరిలో ఆయనకు శ్వేతసౌధానికి వచ్చే అవకాశం ఉంది” అని ట్రంప్ తెలిపారు. గత జనవరి 27న ట్రంప్‌తో మోదీ ఫోనులో సంభాషించారు. అంతర్జాతీయ శాంతి, భర్త, టెక్నాలకీ-ట్రేడ్-డిఫెన్స్ రంగాల్లో అడ్వాన్స్‌డ్ కోఆపరేషన్‌కు తీసుకోవాల్సిన చర్యలపై ఉభయులూ చర్చించారు.
అమెరికాతో వాణిజ్య సంబంధాలు పెంచుకోవడంతో పాటు దేశంలోని స్కిల్డ్ వర్కర్లకు వీసాల మంజూరును సులభతరం చేయాలని ప్రధానంగా ఈ పర్యటనలో ట్రంప్ దృష్టికి మోదీ తీసుకువచ్చే అవకాశాలున్నాయి. కాగా, అమెరికా నుంచి బహిష్కరణ జాబితాలో 487 మంది భారతీయులు ఉన్నట్లు విదేశాంగ కార్యదర్శి మిస్త్రీ వెల్లడించారు.
ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం అధికారికంగా తెలియజేసినట్లు పేర్కొన్నారు. సంకెళ్లు వేసి వలసదారులను తరలిస్తున్న తీరుపై అమెరికాకు తమ నిరసన తెలియజేసినట్లు మిస్త్రీ వివరించారు. అక్రమంగా అమెరికా వెళ్లిన వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి చర్యలు చేపడ్తున్నామని తెలిపారు.
అమెరికా పర్యటనకు ముందు, ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 10-12 వరకు ఫ్రాన్స్‌లో నిర్వహించే ఎఐ యాక్షన్ సమ్మిట్‌కు ఆదేశ అధ్యక్షుడు మాక్రాన్‌తో పాటు సహ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. దక్షిణ ఫ్రాన్స్‌లోని కాడరాచెలో నిర్వహిస్తున్న అతిపెద్ద ప్రయోగం ‘ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్ (ఐటిఇఆర్)’ను సందర్శించనున్నారు. ఈ ప్రయోగంలో భారత్ భాగస్వామిగా ఉంది.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు