
కాగా.. ఫోన్‌ట్యాపింగ్‌లో ఇప్పటి వరకు కాంగ్రెస్‌కు సంబంధించి నేతల ఫోన్లే ట్యాపింగ్ గురైనట్లు అంతా భావించారు. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్‌లో బీజేపీకి సంబంధించి నాయకుల పేర్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం త్రిపుర గవర్నర్‌గా ఉన్న ఇంద్రసేనరెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయినట్లు అధికారులు గుర్తించారు.
2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 మధ్య ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సమాచారం.ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న సిట్ ముందుకు శుక్రవారం ఇంద్రసేనా రెడ్డి వ్యక్తిగత సహాయకుడు విచారణకు హాజరయ్యారు. అప్పడు జరిగిన వివరాలను అందజేశారు. ఇంద్రసేనారెడ్డి సంబంధించిన అన్ని వ్యవహారాలను పీఏ చూసుకున్న నేపథ్యంలో ఆయనను ఇందులో సాక్షిగా పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించి గతంలో ఇంద్రసేనారెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గవర్నర్‌గా ఉన్న సమయంలో ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాప్ చేయడం వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? అనేదానిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపనున్నారు. ఇప్పటి వరకు దాదాపు 300 మంది నాయకులు, బిజినెస్మ్యాన్లు, రియల్ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఒక ప్రాధమిక అంచనాకు వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్ఐబీ ఓఎస్టీ ప్రభాకర్ రావు నేృతృత్వంలో పలువురు ప్రముఖులు, వ్యాపార వేత్తలు, రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడగా… ఈ కేసులో అప్పటి ఎస్ఐబీ అధికారులు ప్రణిత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఓఎస్టీ రాధాకిషన్ రావులను అరెస్టు చేశారు. ప్రాథమిక చార్జిషీట్ సైతం దాఖలుచేశారు. అయితే, కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, మరో కీలక నిందితుడు శ్రవణ్ కుమార్ అమెరికాలో ఉండటంతో విచారణ మందగించింది.
More Stories
17 నుంచి `సేవా పక్షం అభియాన్’గా మోదీ జన్మదినం
దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు
తెలంగాణలో 15 నుంచి కాలేజీలు నిరవధిక బంద్