
దేశంతోనూ కాంగ్రెస్ పోరాడుతోందని ఇటీవల రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై గౌహతిలో కేసు నమోదు అయింది. గాంధీ చేసిన ఈ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గౌహతిలోని పాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో మోన్‌జిత్ చాటియా అనే వ్యక్తి రాహుల్ గాంధీపై చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ ఫిర్యాదులో గాంధీ, అశాంతి, వేర్పాటువాద భావోద్వేగాలను రెచ్చగొట్టేలా మాట్లాడారని, ఇది దేశ సార్వభౌమత్వానికి ప్రమాదమని పేర్కొన్నారు. కేసు భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 152, 197 (1) డీ కింద నమోదైంది. 2025 జనవరి 15న ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “బిజెపి, ఆర్ఎస్ఎస్ సంస్థలన్నిటిని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇప్పుడు మేము బిజెపి, ఆర్ఎస్ఎస్, భారత రాష్ట్రంతో పోరాడుతున్నాం” అని చెప్పారు.
రాహుల్ గాంధీ మాటలు జా ద్రతకు, ప్రజల శాంతికి ప్రమాదం కలిగించేలా ఉన్నాయని చెటియా ఆరోపించారు. “తన పోరాటం భారతదేశానికి వ్యతిరేకంగా ఉందని స్పష్టంగా చెప్పడం ద్వారా, ఆయన ప్రజలలో తిరుగుబాటు భావాలను ప్రేరేపించారు,” అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
“ప్రతిపక్ష నేతగా గాంధీకి ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత ఉంది. కానీ, ఆయన తన వేదికను ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, విభజన భావాలను రెచ్చగొట్టడానికి ఉపయోగించారు,” అని చెటియా తన ఆరోపణల్లో తెలిపారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు భారత ఐక్యతకు, సార్వభౌమత్వానికి ప్రత్యక్ష సవాలుగా ఉన్నాయని, తక్షణ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెటియా కోరారు.
More Stories
బెంగాల్ ప్రతిపక్ష నేత బడ్జెట్ సమావేశాల్లో సస్పెన్షన్
`చైనా శత్రువు’ కాదన్న పిట్రోడా వాఖ్యలపై దుమారం
ఢిల్లీ కొత్త సీఎం 20న ప్రమాణస్వీకారం!