భారత్ బలం అద్భుతమైన ఐక్యతలోనే ఉంది

భారత్ బలం అద్భుతమైన ఐక్యతలోనే ఉంది
భారత్ బలం దాని అద్భుతమైన, విజయవంతమైన ఐక్యతలో ఉందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ తెలిపారు. ప్రపంచానికి అంతిమ శాంతిని అందించే హిందూ జీవన విధానం అనేక సమస్యలకు పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు. కేరళలోని వడయంపాడి పరమభట్టర కేంద్రవిద్యాలయంలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ దక్షిణ కేరళ ప్రాంత విద్యార్ధి సాంఘిక్‌లో ఆయన మాట్లాడారు. 
 
ఆర్‌ఎస్‌ఎస్ మొత్తం హిందూ సమాజాన్ని ఏకం చేయడం, ధర్మ రక్షణ ద్వారా ప్రపంచానికి ఫలవంతమైన, ప్రయోజనకరమైన పరిష్కారాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. “అవతారాలు (దైవిక అవతారాలు) మాత్రమే మార్పును తీసుకురాలేవు. తమకు తాముగా సహాయం చేసుకోని వారిని దేవుడు డా రక్షించడని తరచుగా చెబుతారు. మనం భారత సంతానమే. క్షలాది మంది పిల్లలు ఉన్నప్పటికీ ఒక తల్లి నిస్సహాయంగా మారితే, మన కర్తవ్యం ఏమిటి?” అని డా. భగవత్ ప్రశ్నించారు.
 
ఈ విధిని నెరవేర్చడానికి, మనకు బలం అవసరం అని చెబుతూ బలం ప్రభావవంతంగా ఉండాలంటే, మనకు క్రమశిక్షణ, జ్ఞానం అవసరం అని తెలిపారు. మనకు దృఢ సంకల్పం, ఎట్టి పరిస్థితుల్లోనూ మన లక్ష్యాలపై అచంచల దృష్టి అవసరం అని పేర్కొంటూ సంఘ్ ప్రయత్నాలు అటువంటి వ్యక్తులను నిర్మించడంపై దృష్టి పెడతాయని ఆయన వివరించారు.
 
ప్రపంచంలోని అన్ని తత్వాలు సౌకర్యాన్ని వాగ్దానం చేశాయని చెబుతూ భౌతికవాదం, సంప్రదాయాలు అన్నీ సౌకర్యాన్ని వెతుక్కునే దిశగా పనిచేశాయని తెలిపారు. జ్ఞానం సౌలభ్యాన్ని పెంచింది, కానీ ఆనందం సాధించదని సర్ సంఘచాలక్ స్పష్టం చేశారు. భారతదేశంలో కూడా పోరాటాలు కొనసాగుతున్నాయని,రైతులు, వినియోగదారులు, కార్మికులు, పాలక పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అన్నీ నిరసనలలో పాల్గొంటాయని ఆయన గుర్తు చేశారు.
 
యుద్ధాలు, పర్యావరణ విధ్వంసం కొనసాగుతోందని, లెక్కలేనన్ని సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంటూ ఈ సమస్యలన్నింటికీ పరిష్కారాలు భారతదేశంలోనే ఉన్నాయని డా. భగవత్ తెలిపారు. అక్కడికి ప్రయాణించిన ఒక న్యూరాలజిస్ట్ చెప్పినట్లుగా, పశ్చిమ దేశాల వైఫల్యం మూలాలను మరచిపోతూ ఫలాలను వెతకడంలో ఉందని చెప్పారు.
 
అయితే, దీనికి విరుద్ధంగా, మనం మన మూలాలను పెంచుకుంటున్నాం కానీ ఫలాలను కోరుకోలేదని, మనకు రెండూ అవసరం అని ఆయన తెలిపారు. భారత్ తత్వశాస్త్రం అందరినీ ఆలింగనం చేసుకుంటుందని పేర్కొంటూ ఇది సమాజం, వ్యక్తి,  శ్రుష్టిని పరమేష్టి వైపు ప్రయాణంలోకి సమన్వయం చేస్తుందని ా. భగవత్ వరించారు.
 
మనస్సు, ద్ధ, శరీరంల అమరిక ద్వారా సాధించిన ఆత్మ మోక్షానికి ఇది ఒక మార్గం అని ఆయన వివరించారు. భారత్ శక్తివంతమైన దేశంగా మారడం ప్రపంచానికి చాలా అవసరం అని స్పష్టం చేశారు. వైవిధ్యాన్ని స్వీకరించే మన ప్రత్యేక సాంస్కృతిక ఐక్యత మన బలం అని చెబుతూ కాశీలోని గంగా జలాలను రామేశ్వరంలో అర్పించే భూమి ఇదని డా. భగవత్ గుర్తు చేశారు.
 
కాలడిలో జన్మించి, ఈ ఐక్యతను ప్రచారం చేయడానికి దేశంలోని నాలుగు మూలల్లో ధామాలను స్థాపించిన శంకరుడి భూమి ఇదని ఆయన తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ దక్షిన్ క్షేత్ర సంఘచాలక్ డాక్టర్ ఆర్. వన్నియరాజన్, దక్షిణ్ కేరళ ప్రాంత సంఘచాలక్ ప్రొఫెసర్ ఎం.ఎస్. రమేషన్ హాజరయ్యారు. సర్ సంఘచాలక్ ప్రసంగాన్ని ప్రాంత సహ కార్యవాహ్ కె.బి. శ్రీకుమార్ అనువదించారు. ప్రాంత కార్యవాహ్ టి.వి. ప్రసాద్ బాబు స్వాగత ప్రసంగం చేశారు.