
అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం ప్రమాణస్వీకారం చేస్తారు. యూఎస్ కాపిటల్ ఈ కార్యక్రమానికి వేదిక కానున్నది. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రెండు బైబిల్స్‌ను ఉపయోగించబోతున్నట్లు సమాచారం.
ఇందులో ఓ బిబైల్‌ను ఆయనకు తల్లి బహుమతిగా ఇచ్చింది. ట్రంప్ 1955లో న్యూయార్క్‌లోని జమైకాలోని సండే చర్చిల్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సందర్భంలో బైబిల్‌ను గిఫ్ట్ ఇచ్చారు. ఇక రెండో బైబిల్‌ను లింక్ లింకన్ బైబిల్‌గా పిలుస్తారు. అమెరికా తొలి అధ్యక్షుడు అబ్రహం లింకన్ 1861లో అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం సమయంలో ఆ బిబైల్‌ను ఉపయోగించారు.
అయితే, ఈ బిబైల్‌ను ఇప్పటి వరకు మూడుసార్లు మాత్రమే ఉపయోగించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రెండుసార్లు అదే బైబిల్‌తో ప్రమాణస్వీకారం చేశారు. అలాగే, 2017లో డోనాల్డ్ ట్రంప్ మూడోసారి ఈ బైబిల్‌పై ప్రమాణ స్వీకారం చేశారు. ఉపాధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న జేడీ వాన్స్ సైతం ప్రమాణస్వీకారం సందర్భంగా తనకు తల్లి చిన ిల్‌ను ఉపయోగించనున్నారు. ఆయన అమ్మమ్మ బైబిల్‌ను తల్లికి ఇవ్వగా, ఆ బైబిల్‌ను ఫ్యామిలీ బైబిల్‌గా పిలుస్తారు.
ఇదిలా ఉండగా, ట్రంప్ ఈ సారి భిన్నంగా ప్రమాణస్వీకారం వేదికగా మార్పు చేశారు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత.. రోటుండాలో జరుగనున్నది. ఈ మేరకు కార్యక్రమానికి ఏర్పాట్లు సిద్ధం చేశారు. ప్రస్తుతం వాషింగ్టన్‌లో భారీగా చలి ఉన్నది. ఈ క్రమంలో రోటుండా సముదాయం లోపల వెచ్చటి వాతావరణంలో ట్రంప్ ప్రమాణం చేయనున్నారు.వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని క్యాపిటల్ భవనం పశ్చిమ భాగంలో నేషనల్ మాల్, జాతీయ చిహ్నాల ఎదుట వేలాది మంది మధ్య ప్రమాణస్వీకారం జరిగేది. ఈ సారి చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో క్యాపిటల్ భవనం లోపల ఉండే రోటుండా సముదాయంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 20న వాషింగ్టన్‌లో దాదాపు మైనస్ 11 డిగ్రీలు ఉంటుందని అంచనా.
ఈ క్రమంలో దాదాపు 1985 తర్వాత ప్రమాణస్వీకారోత్సవం రోటుండాలో నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు రోనాల్డ్ రీగన్ చలి కారణంగా రోటుండాలో ప్రమాణస్వీకారం చేశారు. రోనాల్డ్ రీగన్ తరహాలోనే తాను సైతం రోటుండాలో ప్రమాణ స్వీకార ప్రసంగం చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
More Stories
ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై సౌదీ అరేబియాలో నేడే శాంతి చర్చలు
మారిషస్ మాజీ ప్రధాని జగన్నాథ్ అరెస్ట్
అమెరికా సైన్యంలో దారి మళ్లిన ఆహార నిధులు