తొలిసారి 400కు పైగా పరుగులతో  మహిళా జట్టు రికార్డు

తొలిసారి 400కు పైగా పరుగులతో  మహిళా జట్టు రికార్డు

* సెంచ‌రీల‌తో చెల‌రేగిన స్మృతి, ప్ర‌తీకా

రాజ్‌కోట్‌ వేదికగా ఐర్లాండ్‌తో మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్‌ జట్టు 304 పరుగుల రికార్డు విజయం సాధించింది. భారత మహిళా జట్టు తొలిసారిగా 400+ స్కోరును నమోదు చేసింది. కొత్త రికార్డులు నమోదైన రాజ్‌కోట్‌లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. అన్ని విభాగాల్లోనూ అదరగొట్టిన టీమ్‌ఇండియా.. సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. భారీ శతకం బాదిన ప్రతీకకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’తో పాటు ’ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డులూ లభించాయి.

ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతికా రావల్ అద్భుతమైన సెంచరీల నేపథ్యంలో, భారత్ తమ 50 ఓవర్లలో 435 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.  ఇది భారత పురుషులు, మహిళల క్రికెట్ చరిత్రలో వన్డేల్లో అత్యధిక స్కోరు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసింది. 50 ఓవర్లలో 435 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు ంధాన 80 బంతుల్లో 135 పరుగులు, ప్రతీకా రావల్‌ 129 బంతుల్లో 154 పరుగులు చేశారు. వీరు తొలి వికెట్‌కు 233 పరుగులు జోడించారు.

గ‌తంలో ఐర్లాండ్‌పైనే 2017లో 249 ర‌న్స్ తేడాతో నెగ్గింది ఇండియా.  అయితే ఇవాళ ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు.. నిర్ణీత ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 435 పరుగులు చేసింది. ఓపెన‌ర్లు స్మృతి మంధాన‌, ప్ర‌తీకా రావ‌ల్ సెంచ‌రీలు చెల‌రేగారు. ఆ ఇద్ద‌రూ తొలి వికెట్‌కు 233 ర‌న్స్ జోడించారు. ఈ క్రమంలో వన్డేల్లో భారత్‌ తరఫున వేగవంతమైన (70 బంతుల్లో) సెంచరీ సాధించిన బ్యాటర్‌గా స్మతి నిలిచింది. 

మంధాన ఔటయిన తరువాత రిచా ఘోష్‌ (59), తేజల్‌ (28), హర్లీన్‌ (15), జెమిమా రోడ్రిగ్స్‌ (4), దీప్తి శర్మ (11) పరుగులు చేశారు. ఐర్లాండ్‌ బౌలర్లలో ఓర్లా 2.. కెల్లీ, ఫ్రేయా, డెంప్సీ తలో వికెట్‌ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఐర్లాండ్‌ 131 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ సారా ఫోర్బ్స్‌ (41) టాప్‌ స్కోరర్‌. ఓర్లా (36), కెప్టెన్‌ గాబీ లూయిస్‌ (1), కౌల్టర్‌ (0),లారా డెలానీ (10),  పాల్‌ (15), కెల్లీ (2) పరుగులు చేశారు. 

భారీ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఐర్లాండ్ ఏ ద‌శ‌లోనే పోరాట స్పూర్తిని ప్ర‌ద‌ర్శించ‌లేదు. వ‌రుస‌గా ఆ జ‌ట్టు వికెట్ల‌ను కోల్పోయింది. ఐర్లాండ్ బ్యాట‌ర్ల‌లో ఫోర్బ్స్ 41, ప్రెండ‌ర్‌గాస్ట్ 36 రన్స్ చేశారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3, తనుజా కాన్వార్‌ 2.. టిటాస్‌ సధు, సయాలి, మిన్ను ఒక్కో వికెట్‌ తీశారు. పరుగులపరంగా భారత్‌ అత్యధిక తేడాతో విజయం సాధించిన మ్యాచ్‌ ఇదే. అంతకుముందు ఐర్లాండ్‌పైనే 2017లో 249 పరుగుల తేడాతో టీమ్‌ఇండియా గెలిచింది.