
రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు జలాశయంలో ఏర్పడిన గందరగోళం ప్రమాదానికి సంకేతంగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నా రు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయంలోని జల విద్యుత్ కేంద్రంలో ఉన్న జనరేటర్ నుంచి నీరు లీక్ అవుతున్నట్లు తెలుస్తోంది. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలోని ఒకటో నెంబర్ జనరేటర్ నుంచి ఈ నీరు బయటకు వస్తున్నట్లు తెలుస్తుంది.
గత వారం రోజులుగా యూనిట్ డ్రాప్స్ ట్యూబ్ జీరో రోడ్ నుంచి ఈ వాటర్ లీక్ అవుతున్నట్లు సమాచారం. పంప్ మోడ్ టర్బన్ వేగంగా తిరగటం వల్ల ఈ సమస్య తలెత్తినట్లు ఇంజనీరింగ్ చెబుతున్నారు. అందులో నుంచి వచ్చే నీరు లీకేజీని ఆపకపోతే ఫ్లోర్ స్లాబ్ పడిపోవడం జరుగుతుందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు.
ఫ్లోర్ స్లాబ్ పడిపోతే జనరేటర్ కూడా మునిగి పోయే ప్రమాదముంది. నీరు చాలా ఎక్కువగా వస్తోంది. గత రెండు నెలలుగా రాత్రింబవళ్లు ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో నుంచి నిరంతరంగా విద్యుత్ కోసం నీరు పోవటంతో జనరేటర్ పై భాగం స్లాబ్ నుంచి నీరు నిరంతరంగా లీకేజీ అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.
More Stories
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం బిజెపి థ్యేయం
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు