బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పోలీస్‌స్టేషన్‌కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మంగళవారం రాత్రి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు పేర్ని నాని నివాసానికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేరు. దీంతో ఇంటి తలుపులకు పోలీసులు నోటీసులు అతికించి వచ్చారు. ఈ నేపథ్యంలోనే పేర్ని జయసుధ న్యాయవాదులతో కలిసి బందరు తాలూకా పోలీస్‌స్టేషన్ వచ్చారు.
కాగా, న్యాయవాదులతో కలిసి విచారణకు వచ్చే క్రమంలో పేర్ని జయసుధ మచిలీపట్నం మేయర్ కారులో పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. దీంతో ఈ విషయం ఇప్పుడు చర్చకు దారితీసింది. ప్రభుత్వ వాహనంలో విచారణకు రావొచ్చా? అంటూ చర్చ జరుగుతోంది. మరోవైపు జయసుధ వెంట వచ్చిన న్యాయవాదులను పోలీసులు పోలీస్ స్టేషన్‌లోకి అనుమతించలేదు. స్టేషన్ బయటే ఆపివేశారు. ఆర్. పేట సీఐ ఏసుబాబు పేర్ని జయసుధను ప్రశ్నిస్తున్నారు.
ఇంకోవైపు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టగా మొత్తం 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్లు అధికారులు తేల్చారు. దీంతో మిగతా బియ్యానికి కూడా జరిమానా చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. ఇంతలో ఈ వ్యవహారంలో పేర్ని జయసుధ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. దాంతో ఆమె జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందీ కోర్టు. అయితే పోలీస్ విచారణకు సహకరించాలంటూ కోర్టు ఆమెకు సూచించింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణకు తన న్యాయవాదులతో కలిసి పేర్ని జయసుధ పోలీస్ విచారణకు హాజరయ్యారు.

More Stories
ఐదో తరం విమానాలు గగనంలో ఎగరబోతున్నాయి
ఏపీలో వారానికి ఒకరోజు నో వెహికల్ డే
“డిజిటల్ భారత్ నిధి” పథకం కింద ఏజెన్సీ ప్రాంతాల్లో 5జీ సేవలు