‘ఈ సంవత్సరం మొత్తం చాలా దురదృష్టకరంగా సాగింది. గతేడాది మే 3 నుంచి నేటి వరకు రాష్ట్రంలోని పరిణామాల విషయంలో ప్రజలకు నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. ఇళ్లను కోల్పోయారు. అందుకు నేను చింతిస్తున్నాను. క్షమాపణలు కోరుతున్నాను’ అని తెలిపారు.
‘అయితే గత నాలుగు నెలలుగా శాంతి భద్రతల పురోగతిని చూసిన తర్వాత 2025 నాటికి రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నేను భావిస్తున్నాను’ అని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ జరిగిన తప్పులను క్షమించి మణిపూర్‌లోని 35 తెగలు కలిసి సామరస్యంగా జీవించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో గత మే నెలలో చెలరేగిన ఘర్షణలు యావత్ దేశాన్ని కలవరపరిచాయి. మైతీలకు రిజర్వేషన్ల అంశంపై కుకీలు, మైతీల మధ్య చిచ్చు రేగింది. రెండు జాతుల మధ్య వైరం హింసాత్మకంగా మారింది. ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగించిన ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. పార్లమెంట్‌ను కూడా ఈ అంశం కుదిపేసింది. ఈ హింసాత్మక ఘటనల్లో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 50 వేల మందికిపైగా నివాసాలను కోల్పోయారు.

More Stories
కుటుంభ సంబంధాలతో ‘లవ్ జిహాద్’ను అడ్డుకోండి
2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ సిద్ధం
వరద సహాయంలో టీఎంసీ ప్రభుత్వం రూ.100 కోట్ల అవినీతి