ఓటింగ్ పట్ల ఆసక్తి చూపని ప్రవాస భారతీయులు

ఓటింగ్ పట్ల ఆసక్తి చూపని ప్రవాస భారతీయులు
భారత ఎన్నికల కమిషన్  ప్రవాస భారతీయులకు ఎంతో శ్రద్ద తీసుకొని ఓటు వేసే అవకాశం కల్పిస్తే, వారు 2024 ఎన్నికలలో ఓటు వేయడం పట్ల చెప్పుకోదగిన ఆసక్తి చూపలేదని వెల్లడవుతుంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా ప్రకారం విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల ఓటింగ్ గణాంకాల గురించి షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. అ
 
యితే ఓటరు జాబితాలో ఎన్‌ఆర్ఐ ఓటర్లు వారి పేర్లను చేర్చుకునే సమయంలో చాలా ఉత్సాహం కనిపించిందని ఎన్నికల సంఘం తెలిపింది. ఆ క్రమంలో ఓటరు జాబితాలో 1.2 లక్షల మంది తమ పేర్లను చేరుకున్నారు. కానీ ఎన్నికల సమయంలో మాత్రం భారత్ కు ఓటు వేసేందుకు వచ్చింది కేవలం 2.48 శాతం మంది మాత్రమే.

డేటా ప్రకారం 2024లో 1,19,374 మంది ఎన్‌ఆర్ఐలు వారి పేర్లను నమోదు చేసుకున్నారని ఎన్నికల సంఘం గణాంకాలను విడుదల చేసింది. ఇందులో కేరళ నుంచి అత్యధికంగా 89,839 రిజిస్ట్రేషన్లు జరిగాయి. కానీ లోక్‌సభ ఎన్నికల సమయంలో కేవలం 2,958 మంది మాత్రమే భారతదేశానికి వచ్చారు. అందులో 2,670 మంది కేరళ నుంచి మాత్రమే ఉన్నారు. 

ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో 885 మంది విదేశీ ఓటర్లలో లోక్‌సభ ఎన్నికల్లో కేవలం ఇద్దరు మాత్రమే ఓటు వేశారని నివేదిక తెలిపింది. దీంతో విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల ఓటింగ్ శాతంపై ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.

ఇలాంటి గణాంకాలు మహారాష్ట్రలో కూడా కనిపించాయి. అక్కడ 5,097 మంది ఎన్నారై ఓటర్లలో 17 మంది మాత్రమే ఓటు వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 7,927 మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు నమోదయ్యారు. కానీ 195 మంది మాత్రమే ఓటు వేశారు. ఇక విదేశాల్లో నివసిస్తున్న కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి అనేక పెద్ద రాష్ట్రాల నుంచి ఒక్క ఎన్నారై కూడా ఓటు వేసేందుకు భారత్‌కు రాలేదని ఎన్నికల సంఘం తెలిపింది. 

అసోం 19 మంది ఓటర్లలో ఎవరూ ఓటు వేయలేదు. బీహార్‌లో కూడా అదే పరిస్థితి ఉంది. నమోదు చేసుకున్న 89 మంది ఎన్నారై ఓటర్లలో ఎవరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. 84 మంది ఓటర్లలో ఎవరూ ఓటు వేయని పరిస్థితి గోవాలో కనిపించింది.  భారతదేశంలోని ఎన్నారై ఓటర్లు ఇక్కడ మాత్రమే తమ ఓటు వేయగలరు.

వారి భారతీయ చిరునామా ఆధారంగా ఓటరు జాబితాలో పేరు నమోదైంది. అయితే ఓటు వేయడానికి వారు వ్యక్తిగతంగా తమ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లాలి.  చాలా మంది ఎన్నారై ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొనలేకపోవడానికి ఇదే కారణం. ఎన్నారై ఓటింగ్ తగ్గడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇందులో సమయాభావం, భారీ ఛార్జీలను పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో ప్రజలు ఓటు వేసేందుకు రావడం మానేశారని పలువురు చెబుతున్నారు.