
సారీ చెప్పడానికి పలు విధానాలు ఉంటాయని పేర్కొంటూ ఘటన జరిగిన రెండో రోజే బాధితులను పరామర్శించాల్సిందని పవన్ పేర్కొన్నారు. అల్లు అర్జున్ వెళ్లకపోయినా కనీసం చిత్ర యూనిట్ అయినా బాధితుడి ఇంటికి వెళ్లి ఉండాల్సిందని తెలిపారు. అల్లు అర్జున్ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించిందని చెప్పారు.
అందరూ రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సిందని, అది చేయకపోవడం వల్లే ఇంతవరకు వచ్చిందని తెలిపారు. “సినిమా అంటే టీం… అందరూ భాగస్వామ్యం ఉండాలి. ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారు. ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం’’ అని పవన్ పేర్కొన్నారు.
“తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమతో గౌరవం, మర్యాదతో వ్యవహరించింది. పుష్ప2 సినిమాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా ప్రోత్సాహం ఇచ్చింది. స్పెషల్ షోలు, టికెట్ రెట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఈ విషయంతో ఏం చేయాలన్నా రెండు వైపుల పదునున్న కత్తిలా రేవంత్ రెడ్డి పరిస్థితి మారింది. అల్లుఅర్జున్ అనే కాదు ఎవరి విషయంలోనైనా రేవంత్ విధానం ఒకటేనని, చట్టం కూడా ఎవరిని విడి విడిగా చూడదు” అని పవన్ స్పష్టం చేశారు.
More Stories
స్వదేశీ, స్వావలంబన దిశగా స్వదేశీ జాగరణ్ మంచ్
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!