విండీస్​తో వన్డే సిరీస్ లో భారత మహిళల క్లీన్ స్వీప్

విండీస్​తో వన్డే సిరీస్ లో భారత మహిళల క్లీన్ స్వీప్

టీమ్ఇండియా మహిళల జట్టు స్వదేశంలో వెస్టిండీస్​తో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. మూడు మ్యాచ్​ల సిరీస్​లో భాగంగా శుక్రవారం జరిగిన ఆఖరి వన్డేలో టీమ్ఇండియా 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. విండీస్ నిర్దేశించిన 163 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 28.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

హర్మన్​ప్రీత్ కౌర్ (32 పరుగులు), జెమిమా రోడ్రిగ్స్ (29 పరుగులు) రాణించారు. విండీస్ బౌలర్లలో డొటిన్, అల్లెని, మ్యాథ్యూస్, ఫ్లెచర్, కరిస్మా తలో 1 వికెట్ పడగొట్టారు. తాజా విజయంలో మూడు మ్యాచ్​ల సిరీస్​ను టీమ్ఇండియా 3-0తో క్లీన్​ స్వీప్ చేసింది. దీప్తి శర్మ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియాను గెలిపించింది. 

తొలుత బ్యాట్ 38 పరుగులు చేసిన దీప్తి అనంతరం బాల్‌తో చెలరేగింది. 6 వికెట్లు పడగొట్టి విండీస్ నడ్డీ విరిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన కరీబియన్ మహిళలు 28.2 ఓవర్లలో 162 పరుగులకు కుప్పకూలింది. ఆ జట్టులో చిన్నెల్లె హెన్రీ(61), కాంప్‌బెల్(46) రాణించగా  మిగతావారెవరూ భారత బౌలర్లు దీప్తి శర్మ(6/31), రేణుకా సింగ్(6/31)ల ధాటికి క్రీజులు నిలవలేకపోయారు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా అమ్మాయిలు అలవోకగా విజయాన్ని అందుకున్నారు. కేవలం 28.2 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసి సునాయాసంగా లక్షాన్ని చేరుకుంది. టాప్ ఆర్డరర్స్ విఫలమైనా సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్‌ను గట్టెక్కించింది. 

స్మృతి మంధాన(4), ప్రతికా రవల్(18), హర్లీన్ డియోల్(1) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరగా.. హర్మన్‌ప్రీత్ కౌర్(32), జెమీమా రోడ్రిగ్స్(29), రిచా ఘోష్(23 నాటౌట్), దీప్తి శర్మ(38) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో డియాండ్రా దాటీన్, అలెన్, హీలీ, కరిష్మా రామ్‌హరక్ తలో వికెట్ తీసారు. ఇక చవరలో రిచా ఘోష్ వరుస సిక్సర్లతో విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది.