అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనలో కొడంగల్‌ వాసులు

అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనలో కొడంగల్‌ వాసులు

సినీ నటుడు అల్లు అర్జున్‌ ఇంటిపై దాడిని బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. దాడి ఘటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతనియొజకవర్గంకు చనెండిన వారు ఉన్నారని చెబుతూ నలుగురు కొడంగల్‌ వాసులున్నారని ఆమె ఆరోపించారు. జైలు నుంచి విడుదలైనటువంటి లగచర్ల రైతులను డీకే అరుణ పరామర్శించారు. 

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్‌ ఇంటిపై దాడి ఘటన నిందితుల్లో ఒకరు కాంగ్రెస్‌ జడ్పీటీసీగా పోటీ చేశారని పేర్కొంటూ ఆ పార్టీ నేతలే ఈ దాడి చేయించారనే అనుమానం కలుగుతోందని ఆమె విమర్శించారు.

కాగా, అల్లు అర్జున్‌, ఆయన కుటుంబాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేధించడం వెనుక అసలు మతలబు వేరే ఉందని, అది త్వరలో తేలుతుందంటూ డీకే అరుణ  సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఒక న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూఇలాంటి కక్ష సాధింపు దోరణిని తాను ఎప్పుడు చూడలేదని అంటూ ఆమె విస్మయం వ్యక్తం చేశారు. 

అసెంబ్లీలో అసలు సమస్యలు లేవన్నట్లు ఎంఐఎం వాళ్ళతో అడిగించుకుని మరీ సీఎం సభలో మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆమె ధ్వజమెత్తారు. ఢిల్లీకి సూట్ కేసులు పంపించే అంశంలో ఎక్కడో చెడిందని.. అందుకే అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసినట్లు ఉన్నారంటూ ఆమె చెప్పుకొచ్చారు.

రేవంత్ రెడ్డి ఏం చేసినా దానికి కచ్చితమైన కారణం ఉంటుందని అంటూ మంత్రి సీతక్క తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే పోలీసులను హీరోలుగా చూపిస్తూ చాలా సినిమాలు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. ఏడాదిలో ఇచ్చిన హామీలపై జనం ఎక్కడ అడుగుతారో అని రేవంత్ రెడ్డి కొత్త డ్రామాకు తెరలేపి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అలాగే అల్లు అర్జున్ ఇంటి మీద దాడిని కూడా ఆమె తీవ్రంగా ఖండించారు.  అంటే దీని వెనక ఇంకా ఏదో బలమైన కారణం ఉందని సందేహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలి కానీ ఇలా చిల్లర పాలిటిక్స్ చేయద్దు అంటూ అరుణ హితవు పలికారు.

 కాగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో పోలీసుల వైఫల్యమే ఉందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ ఘటనను అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఈ సంఘటన జరగకుండా చూసుకోవడంలో పోలీసులు పకడ్బందీగా ఎందుకు వ్యవహరించలేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. రాజకీయాలకు సినిమాలకు ఏం సంబంధమని నిలదీశారు. ఇది రేవంత్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగానే చూడాలని ఆయన తేల్చి చెప్పారు.