
విద్య, ఉద్యోగ, రంగాల్లో 15 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ లింగాయత్ పంచమసాలి వర్గీయులు ఆందోళనకు దిగారు. వివిధ ప్రాంతాల నుంచి బెళగావికి ర్యాలీగా చేరుకున్న ఆందోళనకారులు, తమ డిమాండ్లను పరిష్కరించకపోతే విధాన సౌధను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీస్లు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తరుణంలో తమ డిమాండ్లను పరిష్కరించుకునేందుకు ఇదే సరైన సమయమని ఆందోళనకారులు భావించారు.
మంగళవారం ఓవైపు సమావేశాలు జరుగుతుండగానే పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించుకుంటూ దూసుకుపోయేందుకు యత్నించారు. పలువురు ఉన్నతాధికారుల కార్లను ధ్వంసం చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది.
ప్రస్తుతం ఈ సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 5 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రిజర్వేషన్లను మరింత పెంచాలని లింగాయత్ పంచమసాలీలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 5 శాతం కోటాను 15 శాతానికి పెంచాలని కోరుతున్నారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు