
ప్రభుత్వానికి వ్యతిరేకంగా 60 ఏళ్లలో జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం నెగ్గడం ఇదే తొలిసారి. ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 577 ఓట్లు ఉండగా ప్రధానికి వ్యతిరేకంగా 331 ఓట్లు పడ్డాయి. అవిశ్వాస తీర్మానాన్ని తొలుత మితవాద సభ్యులు ప్రవేశపెట్టగా మారైన్ లె పెన్ నేతృత్వంలోని ఫార్ రైట్ నేషనల్ ర్యాలీ మద్దతు ఇచ్చింది.
ప్రధాని మిచెల్‌కు వ్యతిరేకంగా భారీగా ఓట్లు పడ్డాయి. దీంతో బార్నియర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌ను కలిసి తన రాజీనామా సమర్పించనున్నారు. గత జులైలోనే అధ్యక్షుడు మెక్రాన్ ప్రధానిగా బార్నియర్‌ను నియమించారు. మూడు నెలలకే ఆయన పదవిని కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది.
అంతకుముందు 34 ఏళ్ల గాబ్రియేల్ అట్టల్ జులైలో ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. దీంతో ఈ ఏడాదిలోనే మూడోసారి ప్రధానిని నియమించడం మెక్రాన్‌కు సవాల్‌గా మారనుంది. అధ్యక్షుడు మెక్రాన్ 2027 వరకు పదవిలో కొనసాగనున్నారు. అవిశ్వాసంలో ఓడిన ప్రధాని బార్నియర ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని నడపనున్నారు.
మాజీ ప్రధాని గాబ్రియల్ అటల్ కూడా ఇలాగే తమ ప్రభుత్వాన్ని నడిపిన విషయం తెలిసిందే. ఆపద్దర్మ ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందించే వీలు ఉండదు. అయితే అధ్యక్షుడు మాక్రన్ కొత్త ప్రధానిని నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి మాత్రం ప్రత్యేకమైన డెడ్‌లైన్ ఏదీ లేదు. 24 గంటల్లో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు అధ్యక్షుడు మాక్రన్ తెలిపారు.
ప్రస్తుత పార్లమెంట్‌లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ లేని కారణంగా కొత్త ప్రధాని ఎన్నిక సంక్లిష్టంగానే మారనున్నది. కొత్త ప్రధాని ఎవరు అవుతారన్న దానిపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత సైనిక శాఖ మంత్రి సెబాస్టియన్ లెకోర్న్ పేరు వినిపిస్తున్నది. సెంట్రిస్టు మోడెమ్ పార్టీ నేత ఫ్రాంకోయిస్ బేరౌ పేరు కూడా ప్రస్తావనలో ఉన్నది. వామపక్ష ఎన్ఎఫ్‌పీ కూటమి మాత్రం ఆర్థికవేత్త లూసి కాస్టెట్స్ పేరును ప్రస్తావిస్తున్నది. దేశాన్ని పాలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల కాస్టెట్స్ పేర్కొన్నారు.
More Stories
రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా
ఉక్రెయిన్ నూతన ప్రధానిగా యూలియా స్వైరైదెకో
చెస్ గ్రాండ్‌మాస్టర్ కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద