అగర్తలాలో వీసా, కాన్సులర్ సేవలు నిలిపివేసిన బంగ్లాదేశ్

అగర్తలాలో వీసా, కాన్సులర్ సేవలు నిలిపివేసిన బంగ్లాదేశ్
అగర్తలాలోని బంగ్లాదేశ్ అసిస్టెంట్ హైకమిషన్ భద్రతాపరమైన సమస్యలను పేర్కొంటూ తదుపరి నోటీసు వచ్చేవరకు అన్ని వీసా, కాన్సులర్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. బంగ్లాదేశ్‌లో హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టుకు వ్యతిరేకంగా ప్రదర్శన చేస్తున్న నిరసనకారుల బృందం సోమవారం మిషన్ ప్రాంగణాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
మరోవంక, బంగ్లాదేశ్ మంగళవారం భారత రాయబారిని తన విదేశాంగ కార్యాలయానికి పిలిపించింది. ఢాకాలో తాత్కాలిక బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి రియాజ్ హమీదుల్లాతో జరిగిన సమావేశం నుండి బయటపడిన భారత రాయబారి ప్రణయ్ వర్మ, ఢిల్లీ “స్థిరమైన, నిర్మాణాత్మక సంబంధాన్ని” నిర్మించాలని కోరుకుంటుందని, ఏ ఒక్క సమస్య కూడా ద్వైపాక్షిక సంబంధాలకు అడ్డంకిగా  నిలబడకూడదని పేర్కొన్నారు.
 
“మేము బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వంతో సంబంధాలు కొనసాగించేందుకు  సిద్ధంగా ఉన్నాము” అని ఆయన విలేకరులతో తెలిపారు. అంతకుముందు, బంగ్లాదేశ్ న్యాయ వ్యవహారాల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్, షేక్ హసీనాను తొలగించిన తర్వాత బంగ్లాదేశ్‌తో సంబంధాలను పునఃపరిశీలించాలని న్యూఢిల్లీని కోరారు.
 
 “మేము సమానత్వం, పరస్పర గౌరవం ఆధారంగా స్నేహాన్ని విశ్వసిస్తాము. షేక్ హసీనా ప్రభుత్వం ఎన్నికలు లేకుండా అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండటానికి భారతదేశ అనుకూల విధానాన్ని అనుసరిస్తుండగా, ఇది షేక్ హసీనా బంగ్లాదేశ్ కాదని భారతదేశం గ్రహించాలి” అని ఆయన ఫేస్‌బుక్‌లో రాశారు.
 
కాగా, అగర్తలాలో బంగ్లాదేశ్ మిషన్ మొదటి కార్యదర్శి మహమ్మద్ అల్-అమీన్ సేవల నిలిపివేతను ధృవీకరించారు. ప్రస్తుత భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. “పరిస్థితుల దృష్ట్యా, తదుపరి నోటీసు వచ్చేవరకు అన్ని వీసా మరియు, కాన్సులర్ సేవలు వెంటనే నిలిపివేయబడతాయి” అని అల్-అమీన్ చెప్పారు.
 
బంగ్లాదేశ్‌లో దేశద్రోహానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చిన్మోయ్ కృష్ణ దాస్‌ను అరెస్టు చేయడంకు జరిగిన నిరసన బంగ్లాదేశ్ మిషన్ ప్రాంగణాన్ని ఉల్లంఘించే వరకు ప్రేరేపించబడింది. అగర్తలాలో నిరసనకారులు అరెస్ట్‌తో పాటు బంగ్లాదేశ్‌లోని హిందూ సమాజంపై ఆరోపించిన దాడులను వ్యతిరేకించారు.
 
ఈ ఘటనపై స్పందించిన స్థానిక పోలీసులు త్వరితగతిన చర్యలు తీసుకున్నారు, స్వయంసిద్ధంగా కేసు నమోదు చేసి, ఉల్లంఘనకు పాల్పడిన ఏడుగురిని అరెస్టు చేశారు. అదనంగా, ముగ్గురు సబ్-ఇన్‌స్పెక్టర్‌లను సస్పెండ్ చేయడంతో పాటు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ను బదిలీ చేయడంతో సహా తమ విధులను నిర్లక్ష్యం చేసినందుకు నలుగురు పోలీసు అధికారులను మందలించారు.
 
భారత ప్రభుత్వం ఉల్లంఘనపై తన ఆందోళనను వ్యక్తం చేసింది, ఈ సంఘటనను “తీవ్ర విచారకరం” అని పేర్కొంది.  దౌత్యపరమైన ఆకృతిని కొనసాగించవలసిన ప్రాముఖ్యతను స్పష్టం చేసింది.