జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన ముఖ్యమంత్రి, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆదివారం ఆయన గవర్నర్ సంతోష్ గంగ్వార్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన గవర్నర్‌కు రాజీనామాను సమర్పించారు.
కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇండియా కూటమి ఎమ్మెల్యేల మద్దతు లేఖను సమర్పించారు. సోరెన్ వెంట కూటమి నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 28న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. కూటమి తరఫున ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించామని, రాజీనామాను గవర్నర్‌కు సమర్పించానని చెప్పారు.
గవర్నర్ తనకు తాత్కాలిక సీఎంగా బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. అంతకు ముందు ఇండియా కూటమి నేతల సమావేశం జరిగింది. సమావేశంలో ఆయనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు మద్దతు ప్రకటించారని తెలిపారు. హేమంత్ సోరెన్‌ను జార్ఖండ్ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారని కాంగ్రెస్ నాయకుడు సుబోధ్‌కాంత్ సహాయ్ తెలిపారు.
ఆయన 28న సీఎంగా ప్రమాణం చేసే అవకాశం ఉన్నది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని కూటమి మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. 81 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో కూటమి 56 స్థానాలు గెలిచింది. ప్రతిపక్ష బీజేపీకి కేవలం 24 సీట్లే దక్కాయి.
More Stories
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు దోషికి జీవిత ఖైదు
భారత్ బలం అద్భుతమైన ఐక్యతలోనే ఉంది
రాహుల్ గాంధీపై గౌహతిలో కేసు