మహారాష్ట్ర, జార్ఖండ్‌లో బీజేపీకే ఓటర్ల మొగ్గు

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో బీజేపీకే ఓటర్ల మొగ్గు
మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమికే ఓటర్లు మొగ్గుచూపారు. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ కూటమికే ఓటర్లు పట్టం కట్టారని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ 145 మ్యాజిక్‌ ఫిగర్‌ దక్కిన పార్టీకి అధికారం దక్కనుంది. 
 
అయితే 182 స్థానాలతో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అతిపెద్ద పార్టీగా అవతరించనుందని తెలిపింది. శివసేన(ఏక్‌నాథ్‌షిండే) పార్టీ 42-61 స్థానాలు, ఎన్సీపీ అజిత్‌ పవార్‌ 14-25 స్థానాలు సాధించే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ 24-44 స్థానాలు, శివసేన (యూబీటీ) 21-36 స్థానాలు, ఎన్సీపీ (శరద్‌ పవార్‌) 28-41 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే అంచనా వేసింది.
 

పీపుల్స్‌ పల్స్‌ అంచనా ప్రకారం.. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 182 స్థానాలు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ కూటమి 97 స్థానాలు, ఇతరులు 9 స్థానాలు దక్కించుకుంటారు.

రిపబ్లిక్‌ పీమార్క్‌ ఎగ్జిట్‌ పోల్‌ ప్రకారం.. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 137-157 స్థానాలు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ కూటమి 126-146 స్థానాలు, ఇతరులు 2-8 స్థానాలు దక్కించుకుంటారు.

ఏబీపీ మ్యాట్రిజ్‌ ఎగ్జిట్‌ పోల్‌ ప్రకారం.. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 150-170 స్థానాలు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ కూటమి 110-130 స్థానాలు, ఇతరులు 8-10 స్థానాలు దక్కించుకుంటారు.

సీఎన్‌ఎన్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం.. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 154 స్థానాలు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ కూటమి 128 స్థానాలు, ఇతరులు 6 స్థానాలు దక్కించుకుంటారు.

చాణక్య సర్వే ప్రకారం.. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 152-160 స్థానాలు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ కూటమి 130-138 స్థానాలు, ఇతరులు 6-8 స్థానాలు దక్కించుకుంటారు.

లోక్షాహి మరాఠి – రుద్ర సర్వే ప్రకారం.. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 128-142 స్థానాలు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ కూటమి 125-140 స్థానాలు, ఇతరులు 18-23 స్థానాలు దక్కించుకుంటారు.

జార్ఖండ్‌లో..

పీపుల్స్‌ పల్స్‌ అంచనా ప్రకారం.. జార్ఖండ్‌లోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గానూ.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డేయే కూటమి 46-58 స్థానాలు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని జేఎంఎం కూటమికి 24-34 స్థానాలు, ఇతరులు 6-10 స్థానాలు దక్కించుకుంటారు.

ఏబీపీ మ్యాట్రిజ్‌ అంచనా ప్రకారం.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డేయే కూటమి 42-47 స్థానాలు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని జేఎంఎం కూటమికి 25-30 స్థానాలు, ఇతరులు 1-14 స్థానాలు దక్కించుకుంటారు.

యాక్సిస్‌ మై ఇండియా అంచనా ప్రకారం.. జార్ఖండ్‌లోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గానూ.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డేయే కూటమి 25 స్థానాలు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని జేఎంఎం కూటమికి 53 స్థానాలు, ఇతరులు 3 స్థానాలు దక్కించుకుంటారు.

టైమ్స్‌ నౌ అంచనా ప్రకారం.. జార్ఖండ్‌లోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గానూ.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డేయే కూటమి 40-44 స్థానాలు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని జేఎంఎం కూటమికి 30-40 స్థానాలు, ఇతరులు 1 స్థానాలు దక్కించుకుంటారు.