ఎయిర్ ఇండియా గ్రూప్ -ఎయిర్ ఇండియా, విస్తారా మధ్య ఆపరేషనల్ ఇంటిగ్రేషన్, చట్టపరమైన విలీనాన్ని పూర్తి చేసి ఓ పెద్ద పూర్తిస్థాయి సర్వీస్ క్యారియర్‌ను సృష్టించిందని, ప్రైవేటీకరణ అనంతర ప్రయాణంలో ఓ ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని కంపెనీ పేర్కొంది. అక్టోబర్ 1న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్ (గతంలో ఎయిర్ ఏషియా ఇండియా) ఖర్చుతో కూడిన ఎయిర్‌లైన్స్ అని కంపెనీ ప్రకటనలో పేర్కొంది.
విస్తారా అనేది టాటా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్. ఎయిర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్యాంప్‌బెల్ విల్సన్ మాట్లాడుతూ ఈ విలీనం ఎయిర్ ఇండియా గ్రూప్ ప్రైవేటీకరణ అనంతరం పునర్నిర్మాణ దశను పూర్తి చేసిందని, ఇది ముఖ్యమైన మైలురాయి అని పేర్కొన్నారు. గత రెండేళ్లలో నాలుగు ఎయిర్‌లైన్స్‌లోని నాలుగు బృందాలు వీలైనంత వాటారుదాలతో కలిసి ప్రయాణికులకు సేవలందించాయని పేర్కొన్నారు.
టాటా గ్రూప్ జనవరి 2022లో ప్రభుత్వం నుంచి నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసింది. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్‌లైన్స్‌ను విలీనం చేసుకుంది. విస్తారా విలీనం తర్వాత భారత్ అతిపెద్ద ఇంటర్నేషనల్ క్యారియర్‌గా, దేశీయ రెండో అతిపెద్ద సంస్థగా నిలిచింది. టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సైతం ఉన్నది. అక్టోబర్ 1న ఏఐఎక్స్ కనెక్ట్‌ని విలీనం చేసుకున్నది.
ఎయిర్ ఇండియా 80 నారో బాడీ, 60 వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కలిగి ఉండగా, విస్తారా 63 నారో బాడీ, ఏడు వైడ్‌బాడీ విమానాలను ఉన్నాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 90 నారో బాడీ విమానాలను ఉన్నాయి. ఎయిర్ ఇండియా గ్రూప్‌కి 300 విమానాలు ఉండగా.. 103 గమ్యస్థానాలకు సేవలు అందిస్తున్నది. 312 దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో పని చేస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫ్లీట్‌లో బోయింగ్ 777-300 ఈఆర్, 777-200 ఎల్‌ఆర్, 787-8, 787-9, A320 ఫ్యామిలీ ఎయిర్‌క్రాఫ్ట్, ఏ350 ఉన్నాయి.
More Stories
ఆర్బిఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా
కొత్తగా వంద ఎయిర్‌బస్ విమానాలకు ఆర్డర్
నోయిడా విమానాశ్రయం రన్‌వేపై తొలి విమానం