అభివృద్ధి భారతం కలల సాకారానికి యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. వికసిత భారత్ ఆలోచనతో ప్రతి ఒక్కరూ మమేకం కావాలని, ఎవరెవరు ఎక్కడున్నా వికసిత్ భారత్ కోసం తమ వంతు భాగస్వామ్యం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.
గుజరాత్‌లోని వడ్తాల్‌లో ప్రఖ్యాత శ్రీ స్వామినారాయణ్ మందిర్ 200వ వార్షికోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని పాల్గొని ప్రసంగించారు.
”నేను, మీరు, మనమంతా వికసిత్ భారత్ కోసం ప్రజలను ప్రోత్సహించాలి. ముఖ్యంగా యువత ఆలోచనను ప్రోత్సహించి వికసత్ భారత్ కలలను సాకారం చేయాలి. అభివృద్ధి భారతం కలల సాకారంలో తొలుత దేశం స్వయం సమృద్ధి సాధించాలి” అని చెప్పారు.
“ఇందుకోసం బయట నుంచి ఎవరో సాయం రారు, మనమే దీన్ని స్వయంగా సాధించాలి. ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రమోషన్‌తో ముందుకెళ్లాలి. కలిసికట్టుగా మనం ఉంటేనే ఇది సాధ్యం. కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం కులం, లింగ వివక్ష పేరుతో దేశాన్ని విడదీయాలనుకుంటున్నారు. ఇది దురదృష్టకరం. ఇలాంటి శక్తులను ఓడించాలి” అని ప్రదాని దిశానిర్దేశం చేశారు.

More Stories
సింగరేణిలో అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోపిడీ
రామాలయం విరాళాల చోరీపై సిట్ నివేదిక కోరిన సుప్రీం
ప్రత్యేక లోక్ అదాలత్‌కు జ్ఞాన్వాపి, మధుర, సంభాల్ వివాదాలు