రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్

రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్
 
ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రూ.2.94లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లుగా పేర్కొన్నారు. వివిధ కీలక రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లు పయ్యావుల కేశవ్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు.

బడ్జెట్‌లో మూల ధన వ్యయం రూ.32,712.84 కోట్లు కాగా రెవిన్యూ లోటును రూ.34,743.38కోట్లుగా ఉంది. ద్రవ్య లోటు రూ.68,742.65కోట్లుగా ఉంది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవిన్యూ లోటు 4.19శాతం, ద్రవ్యలోటు 2.12శాతం ఉంది.

2023-24 ఆర్థిక సంవత్సరంలో రెవిన్యూ వ్యయం రూ.2,12,450కోట్లు కాగా మూలధన వ్యయం రూ23,330కోట్లుగాఉంది. 2023 * 24లో రెవిన్యూ లోటు రూ.38,682కోట్లుగా ఉంది. ఇప్పటికే రెండు విడతలుగా ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా మిగిలిన నాలుగు నెలల కాలానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ ప్రవేశపెడతారు.

శాఖల వారీగా కేటాయింపులు

1.పర్యావరణం అటవీ శాస్త్ర సాంకేతిక శాఖకు రూ.687కోట్లను కేటాయించారు.

2.మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక టాస్క్‌ఫోర్స్‌లో 3172 యూనిట్లకు శిక్షణ ఇచ్చేందుకు పోలీస్ శాఖకు రూ.8,495కోట్లను కేటాయించారు.

3. పోలీస్ బలగాల ఆధునీకరణకు రూ.62కోట్లను కేటాయించారు. 13ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు.

4. పర్యాటక సాంస్కృతిక శాఖకు రూ.322కోట్ల కేటాయింపు

5. రోడ్లు భవనాల శాఖకుే రూ.9,554కోట్ల కేటాయింపు

6.రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.15వేల కోట్ల నిధులను కేంద్రం సహకారంతో సమీకరణ

7. ఇంధన శాఖకు రూ.8207కోట్ల కేటాయింపు

8. పరిశ్రమల శాఖకు రూ.3127 కోట్ల కేటాయింపు

9. జలవనరుల శాఖకు రూ.16,705కోట్ల కేటాయింపు

10. గృహ నిర్మాణ రంగానికి రూ.4102 కోట్ల కేటాయింపు

11. పురపాలక, పట్టణాభివృద్ధి శా‌ఖకు రూ.11,490కోట్లను కేటాయించారు.

12. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి వాఖలకు రూ.16,739కోట్లను కేటాయించారు.

13. వైద్య ఆరోగ్య శాఖకు రూ.18,421 కోట్లను కేటాయించారు.

14. ఉన్నత విద్యాశాఖకు రూ.2,326 కోట్ల కేటాయింపు

15. పాఠశాల విద్యాశాఖకు రూ.29,909 కోట్ల కేటాయింపు

16. స్కిల్‌ డెవలప్‌బమెంట్‌ కోసం రూ.1215కోట్ల కేటాయింపు

17. మహిళా, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు రూ.4,285కోట్ల కేటాయింపు

18. షెడ్యూల్ కులాల సంక్షేమం కోపం రూ.18,497కోట్లు, షెడ్యూల్ తెగల కోసం రూ.7557కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.39,007కోట్లు, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమానికి రూ.4376కోట్లు కేటాయించారు.

19.వ్యవసాయం అనుబంధ రంగాలకు రూ.11,855కోట్లను కేటాయించారు.