“నేను నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యాను. కానీ, గత మూడు సార్లు ఎలాంటి ఇబ్బందులు పడలేదు కానీ, ఈ సారి మాత్రం మొత్తం విధ్వంసం అయిన వ్యవస్థని గాడిలో పెట్టటానికి చాలా సమస్యలు ఉన్నాయి. అయినా సరే వెనక్కు తగ్గేది లేదు. గాడి తప్పిన వ్యవస్థలని, గాడిలో పెట్టే దాకా నిద్రపోను” సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
భవిష్యత్లో ఏ ఇజం ఉండదని, టూరిజం ఒక్కటే ఉంటుందని ఆయన చెప్పారు. సాంకేతికత చాలా వేగంగా పెరుగుతోందని, దానిని పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో ఎయిర్ పోర్టుల్లోనే కాకుండా సీప్లేన్ ద్వారా రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
ఏపీలోని 4 రూట్లలో సీప్లేన్ సర్వీసుల ప్రతిపాదనలు ఉన్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. పర్యాటకులకు అందుబాటులో ఉండే విధంగా సీ ప్లేన్ ధరలు ఉంటాయని చెప్పారు. సీ ప్లేన్ ఆపరేటింగ్కు కేవలం రెండు కిలోమీటర్లు నీరు ఉంటే సరిపోతుందని చెబుతూ ఎయిర్ పోర్టులు లేని ప్రాంతంలో సీ ప్లేన్స్ బాగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

More Stories
ఇంద్రకీలాద్రిపై ‘శ్రీ చక్ర అర్చన’లో పురుగులు ఉన్న పాలు!
పరకామణిలో చోరీ కేసుబలహీనపర్చారు
‘అమరావతి’కి చట్టబద్ధత కల్పించండి