భారతదేశం, కెనడా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత మధ్య, బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై దాడి రెండు దేశాల మధ్య తాజా మంటలకు ఆజ్యం పోసింది.ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన భారత ప్రభుత్వం ఆదివారం హిందూ సభా దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకున్న తీవ్రవాదులు, వేర్పాటువాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
“అంటారియోలోని బ్రాంప్టన్‌లోని హిందూ సభ ఆలయంలో నిన్న తీవ్రవాదులు మరియు వేర్పాటువాదులు జరిపిన హింసాత్మక చర్యలను మేము ఖండిస్తున్నాము. అటువంటి దాడుల నుండి అన్ని ప్రార్థనా స్థలాలను రక్షించాలని మేము కెనడా ప్రభుత్వాన్ని కోరుతున్నాము” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధిరణధీర్ జైస్వాల్ ప్రకటించారు.
ఈ సంఘటన హిందూ సభ మందిర్, భారత కాన్సులేట్ సంయుక్తంగా నిర్వహించిన కాన్సులర్ ఈవెంట్‌కు అంతరాయం కలిగించింది.అయితే, దాడులు, హింసతో సంబంధం లేకుండా కాన్సులర్ సేవలు పనిచేస్తాయని భారత ప్రభుత్వం తెలిపింది.“భారతీయులకు , కెనడియన్ పౌరులకు సేవలను అందించడానికి మా కాన్సులర్ అధికారుల ఔట్రీచ్ బెదిరింపులు, వేధింపులు, హింస ద్వారా నిరోధించబడదు” అని ఆయన స్పష్టం చేశారు.
ఆదివారం, పీల్ ప్రాంతీయ పోలీసులు బ్రాంప్టన్‌లోని ఒక హిందూ దేవాలయం వద్ద నిరసన జరిగిందని సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న ధృవీకరించని వీడియోలు ఖలిస్తాన్‌కు మద్దతుగా బ్యానర్లను పట్టుకున్న ప్రదర్శనకారులను చూపించినట్లు కనిపిస్తున్నాయని కెనడియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ నివేదించింది.ఈ వీడియోలు హిందూ సభ మందిర్ ఆలయానికి చుట్టుపక్కల ఉన్న మైదానంలో పిడికిలి తగాదాలు, ప్రజలు ఒకరినొకరు స్తంభాలతో కొట్టుకుంటున్నట్లు కనిపిస్తున్నాయని నివేదిక పేర్కొంది.
కాగా, బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయం, భక్తులపై జరిగిన దాడి ఘటనపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందిస్తూ ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. తమ దేశంలోని ప్రజలు అన్ని మతాలను పాటించే హక్కును కాపాడతామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించి దర్యాప్తు చేపట్టాలని ప్రాంతీయ పోలీసులన ట్రూడో ఆదేశించారు.
మరోవైపు ఈదాడి ఘటనపై బ్రాంప్టన్ మేయర్ తీవ్రంగా స్పందించారు. హిందూ ఆలయం వెలుపల జరిగిన దాడి ఘటన విని ఆందోళన చెందినట్లు చెప్పారు. కెనడాలో మత స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. దాడులకు తెగబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దోషులుగా తేలిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని హెచ్చరించారు.
కెనడాలోని బ్రాంప్టన్‌లోని హిందూ సభ ఆలయంపై ఖలిస్థానీ తీవ్రవాదులు ఇటీవల జరిపిన దాడిని ప్రతిపక్ష నాయకుడు పియరీ పొయిలీవ్రే, టొరంటో ఎంపీ కెవిన్ వూంగ్ , ఎంపీ చంద్ర ఆర్యతో సహా కెనడా రాజకీయ నాయకులు విస్తృతంగా ఖండించారు. హిందువులను రక్షించడంలో మన దేశ(కెనడా) నాయకులు విఫలమయ్యారని టొరంటో ఎంపీ విమర్శించారు.
దాడుల తర్వాత, కెనడాలోని హిందూ సమాజం కోసం పనిచేస్తున్న హిందూ కెనడియన్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఆలయంపై దాడికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఖలిస్తాన్ తీవ్రవాదులు మహిళలు , పిల్లలను కొట్టడం వీడియోలో కనిపించింది.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము