నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో హిందూ ఆధ్యాత్మిక, సేవా మేళా

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో హిందూ ఆధ్యాత్మిక, సేవా మేళా
సమాజంలో పలు విధాలుగా నిస్వార్ధంగా సేవ చేస్తున్న పలు సేవా సంస్థలు తమ తమ సేవల  వివరాలు ప్రజలకు అందించటానికి ఈ “హిందూ ఆధ్యాత్మిక, సేవా సంస్థ” (హెచ్ఎస్ఎస్ఎఫ్) ఆనిర్వహించే సేవా మేళా నవంబర్ 7 సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అవుతుంది.  నవంబర్ 8,9,10 లలో ఉదయం10 గంటల నుంచి రాత్రి 9 గంట ల వరకు ఈ సేవా మేళా ప్రజల సందర్శనార్ధం తెరచి ఉంటుంది.
త్రిదండి రామానుజ చిన్న జియ్యర్ స్వామి ఆశీ ప్రసంగంతో మేళ ప్రారంభం అవుతుంది. విజయవాడ రామకృష్ణ మిషన్ కు చెందిన శితికంఠనందా మహారాజ్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు.   దీనిలో నగంలోని పలు పాఠశాలల పిల్లలతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు.  వివిధ రోజులలో పాఠశాలల విద్యార్ధులు నిర్వహించే కార్యక్రమాలు:
* మాత్రు పిత్రు వందనం తల్లి తండ్రులపై గౌరవం పెంపొందించటానికి, తల్లితండ్రులు పిల్లల మధ్య అనుబంధం పెంచటానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుంది.
* ఆచార్య వందనం  ఏ సమాజంలో అయితే గురువులకు గౌరవం దొరుకుతుందో ఆ సమాజం అభివృద్ది చెందినట్టు, సుఖ సంతోషలతో వెలుగొందినట్లు చరిత్ర మాత్రమే కాదు, ఈ నాడు ఫిన్లాండ్ దేశం మనకు నిదర్శనం. అక్కడ విద్యావ్యవస్థ లో గురువు స్థానం ఉన్నతమైనది, గౌరవమైనది. ఆ దేశం ప్రపంచంలోనే సంతోషవంత దేశాలలో ప్రథమ స్థానంలో నిలచింది.

* కన్యా వందనము
ఈ కార్యక్రమం మహిళలపై బాలురలో గౌరవం పెంపొందిచటం ద్వారా మహిళలో తమపై నమ్మకం, ధైర్యం పెంపొందించటానికి, తద్వారా సమాజంలో వీరు సాధికారత సాధించటానికి తోడ్పడుతుంది. తద్వారా మహిళలపై జరిగే హింసాత్మక ధొరణులు లేకుండా సమాజాన్ని నిర్మించడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుంది.
* ప్రకృతి వందనము భారతీయ సమాజ జీవన విధానం ప్రకృతితో కలసి జీవించటమే. మన అన్ని పండగలు కూడా ఈ ప్రకృతి ఆరాధనలో భాగమే. కాని కాలాంతరాన మనం బ్రిటిష్ వారి జీవన విధానాన్ని అనుసరిస్తున్నాము.పశ్చిమ  క్రైస్తవ దేశాల వారి జీవన విధానం ప్రకృతిని తమ స్వార్ధ అవసరాలకు వాడుకొని జీవించే విధానం. దానినే అభివృద్ది, ఫేషన్ అని తప్పుగా అర్ధం చేసుకొని మనం  దానిని గుడ్డిగా అనుసరిస్తూ ప్రకృతిని నాశనం చేస్తూ వస్తున్నాము. ఈనాటి బాలలను తిరిగి ప్రకృతి ఆరాధకులుగా తీర్చి దిద్దటమే ఈ కార్యక్రమం  ముఖ్య ఉద్దేశ్యం. ప్రకృతి అనగా – అడవులు, చెట్లు చేమలు, పక్షులు పశువులు, ఈ నేల నీరు, ఆకాశం, ఈ గాలి అన్నిటినీ పరిరక్షించుకునే భాధ్యత మనదే అని తెలియ చెప్పటం.

* పరమవీర వందనము ఈ నాటి బాలలలో ఈ దేశంపై భక్తిని పెంపొందించే కార్యక్రమంలో భాగంగా, పరమ వీర చక్ర సాధించిన వీరులకు వందనాలు అర్పిస్తూ వారి త్యాగాలను గుర్తుచేసుకొనుకకు ఈ కార్యక్రమం రూపొందించటం జరిగింది. పరమవీర చక్ర పొందిన 21 మంది సైనికులకు గౌరవ వందనం జరుపుతారు.