
* దీపాలు, హారతులతో రెండు గిన్నిస్ రికార్డుల సృష్టి
బాలరాముడు కొలువుదీరిన ఆయోధ్యలో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. గత ఎనిమిదేళ్లుగా సరయూ నదీ తీరంలో దీపోత్సవం నిర్వహిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం, ఈసారి కూడా అత్యంత వైభవంగా వేడుకలు జరిపింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా దీపాలు వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. 8వ దీపోత్సవం సందర్భంగా ఏకకాలంలో అత్యధిక మంది హారతిలో పాల్గొనడం, అత్యధిక సంఖ్యలో నూనె దీపాల ప్రదర్శనతో అయోధ్య గిన్నిస్ రికార్డులకెక్కింది. ఏకకాలంలో 25 లక్షలకు పైగా ప్రమిదలలో దీపాలను వెలిగించారు. అలాగే 1,121 మంది వేదాచార్యులు హారతిని సమర్పించి రికార్డు నెలకొల్పారు.
సరయూ నది ఘాట్‌లో 1,121 మంది హారతులు ఇవ్వడం ద్వారా మరో సరికొత్త రికార్డు కూడా సిద్ధమైంది. దీనితో అయోధ్యా నగరం ధగధగా మెరిసిపోయింది. 55 ఘాట్‌లలో ఏర్పాటు చేసిన ఈ ప్రమిదలను ప్రత్యేక డ్రోన్లతో గిన్నిస్ ప్రతినిధులు లెక్కించారు. అయోధ్య దిపోత్సవంలో భాగంగా, యూపీ టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భక్తులు ఏకకాలంలో 25,12,585 దీపాలను వెలిగించారు. ఇది ఇంతకు ముందు ఉన్న అన్ని గిన్నిస్ రికార్డ్లను బ్రేక్ చేసింది.
అయోధ్య ఆలయ ప్రాణ ప్రతిష్ట తర్వాత తొలి దీపావళి కావడం వల్ల దీపోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అయోధ్య పురవీధుల్లో లక్షలాది జనవాహిన మధ్య రామలక్షణ వేషధారులు రథంపై ఊరేగగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా రథం లాగి తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. దీపోత్సవంతో అయోధ్య నగరం ఆధ్యాత్మిక, సాంప్రదాయ, సాంస్కృతిక శోభను సంతరించుకున్నది.
మయన్మార్, నేపాల్, థాయ్‌లాండ్, మలేషియా, కాంబోడియా, ఇండోనేషియా దేశాలకు చెందిన కళాకారులతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. రామ్‌లాలీతో పాటు పలు ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దాదాపు 500 సంవత్సరాల తర్వాత జన్మస్థలమైన అయోధ్యలోని ఆలయంలో రామయ్య మళ్లీ దర్శనం ఇచ్చారు.
దీపోత్సవాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు అయోధ్యకు చేరుకున్నారు. రామ్‌లల్లాకు ఘన స్వాగతం పలికేందుకు అయోధ్య నగరాన్ని వివిధ రకాల లైట్లు, చిత్రాలు, రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. దీపోత్సవం కార్యక్రమానికి ముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రసంగిస్తూఎనిమిదేళ్ల క్రితం తొలి దీపోత్సవ్ జరుపుతున్నప్పుడు యోగీజీ రామమందిరం నిర్మించడని ప్రతి ఒక్కరూ అడిగేవారని, రాముడు త్వరలోనే మనందరికీ ఆశీర్వదిస్తాడని ఆరోజు చెప్పడం జరిగిందని గుర్తుచేశారు.
అయోధ్యలో ఉన్న వైభవం కాశీ, మధురలోనూ ఉండాలని అభిలాషను వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి ఆధ్యాత్మిక నగరంలోనూ పండుగ వాతావరణం ఉండాలని చెప్పారు. భాష, కులం, మతం పేరుతో తాము వివక్ష చూపడం లేదని స్పష్టం చేశారు. రాముడు సింహాసనం అధిష్టించిన తర్వాత ఏం జరిగిందో తాము అదే చేస్తున్నామపేర్కొంటూ నేడు శ్రేష్ఠ భారత్ సైతం అదే బాటలో పుట్టిందని తెలిపారు.వేడుకల సందర్భంగా సుమారు 10వేల మంది భద్రతా సిబ్బంది అయోధ్య రక్షణ బాధ్యతలు నిర్వహించారు.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం