
చైనాలో జననాల రేటు పడిపోవడంతో వేలాది కిండర్‌గార్టెన్స్ మూతపడుతున్నాయి. 2023లో 14,808 కిండర్‌గార్టెన్స్ మూతపడినట్లు చైనా విద్యా శాఖ వార్షిక నివేదిక వెల్లడించింది. వరుసగా మూడు సంవత్సరాల నుంచి కిండర్‌గార్టెన్‌లో చేరే చిన్నారుల సంఖ్య తగ్గిపోతున్నది. గత ఏడాది అంతకుముందు సంవత్సరం కన్నా 53.5 లక్షల మంది చిన్నారులు తగ్గిపోయారు. 2023లో 5,645 ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య అంతకుముందు ఏడాదితో పోలిస్తే 11శాతం తగ్గడం ఇందుకు కారణంగా పేర్కొంది.
అటు ప్రాథమిక పాఠశాలల సంఖ్యలో కూడా భారీ తగ్గుదల కనిపించింది. 2023 ఏడాదిలో 5645 పాఠశాలలు మూతపడినట్లు అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. చైనా జనాభా వరుసగా రెండో ఏడాది పడిపోయి ఇటీవల 140 కోట్లకు చేరుకుంది. గతేడాది జననాల సంఖ్య దాదాపు 20లక్షలు తగ్గినట్లు అంచనా. 2023లో దేశవ్యాప్తంగా 90లక్షల జననాలు చోటుచేసుకోగా, 1949 నుంచి ఇంత తక్కువగా నమోదు కావడం అదే తొలిసారి.
జనాభా పరంగా చైనా రెండు సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఓవైపు జననాల, సంతానోత్పత్తి రేట్లు తగ్గిపోగా మరోవైపు వృద్ధ జనాభా పెరిగిపోతుంది. 2023 నాటికి 60ఏళ్లు పైబడిన వారి సంఖ్య 30 కోట్లకు చేరుకోగా 2035 నాటికి ఈ సంఖ్య 40కోట్లు, 2050 నాటికి 50 కోట్లకు చేరుకుంటుందని ఇటీవల ఓ నివేదిక అంచనా వేసింది. ఈ క్రమంలోనే మూతపడిన కిండర్‌గార్టెన్లను వృద్ధుల సంరక్షణ కేంద్రాలుగా మారుస్తున్నారు. ఆయా పాఠశాలల సిబ్బంది కూడా వృద్ధులకు సంరక్షకులుగా విధులు నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.
చైనా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే మందగమనంలో ఉంది. జననాల రేట్లు మొత్తం జనాభాకు అనుగుణంగా లేవు. మరోవైపు వృద్ధుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో జనాభాలో అసమతుల్యత వల్ల భవిష్యత్తులో ఆర్థికాభివృద్ధి దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
చైనాలో ప్రస్తుతం వృద్ధులు ప్రభుత్వ సామాజిక భద్రత పథకాలపై ఆధారపడుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుంది. 2016లో ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడానికి దంపతులకు అనుమతి ఇచ్చారు. 2021లో దీనిని సవరించి ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడానికి అనుమతించారు. కానీ ధరల భారం భయంతో దంపతులు ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ఇష్టపడటం లేదు.
కొన్ని ప్రాంతాలు రెండవ లేదా మూడవ శిశువులను కలిగి ఉన్న కుటుంబాలకు సబ్సిడీలను అందిస్తున్నాయి. దక్షిణ చైనాలోని జనసాంద్రత కలిగిన ప్రావిన్స్ అయిన గ్వాంగ్‌డాంగ్‌లో, ఒక గ్రామం రెండవ బిడ్డకు 10,000 యువాన్లు (£1,083), మూడవ బిడ్డకు 30,000 యువాన్‌లు బోనస్‌లను అందిస్తోంది అని చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది.
అయితే, ప్రభావవంతమైన ఆర్థికవేత్త, జనాభా శాస్త్రజ్ఞుడు లియాన్ జియాన్‌జాంగ్ అటువంటి ప్రోత్సాహకాలు తగినంతగా ప్రభావం చూపవని వాదించారు. జూన్‌లో ప్రచురించబడిన ఒక కథనంలో, మూడవ, తదుపరి పిల్లలకు నెలవారీ 3,000 యువాన్ల వరకు రాయితీలు ఇవ్వాలని లియాన్ పిలుపునిచ్చారు. కొత్త శిశువులకు 100,000 యువాన్లు (£10,821) ఒకేసారి నగదు బహుమతిని అందించాలని సూచించారు.
2016లో, చైనా దశాబ్దాలుగా ఉన్న ఒక బిడ్డ విధానం రద్దు చేసింది. జంటలు సాధారణంగా ఇప్పుడు ముగ్గురు పిల్లలను కలిగి ఉంటున్నారు. 80 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న సిచువాన్ లో తల్లిదండ్రులు నమోదు చేసుకోగల శిశువుల సంఖ్యపై అన్ని పరిమితులను తొలగించారు. గత సంవత్సరం, చైనా జనాభా 2.08 మిలియన్లకు పడిపోయింది. ఇది వరుసగా రెండవ సంవత్సరం క్షీణించింది. జననాల రేటు 1,000 మందికి 6.39 జననాలు అనే రికార్డును నమోదు చేసింది.
More Stories
కాబూల్‌పై పాకిస్థాన్ బాంబుల వర్షం… టీటీపీ చీఫ్ హతం?
ఆఫ్ఘన్ భూభాగాన్ని మరో దేశంకు వ్యతిరేకంగా అనుమతించం!
మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి