అధ్యక్ష ఎన్నికల్లో దూసుకెళ్తున్న డొనాల్డ్ ట్రంప్

అధ్యక్ష ఎన్నికల్లో దూసుకెళ్తున్న డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు! వాల్ స్టీట్ జర్నల్ నిర్వహించిన జాతీయ సర్వేలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్పై ట్రంప్ స్వల్ప ఆధిక్యం సాధించినట్లు తేలింది. ట్రంప్కు 47 శాతం, హారిస్కు 45 శాతం మంది ఆదరణ ఉన్నట్లు సర్వే సంస్థ తెలిపింది. కమలపై హారిస్ 2 శాతం ఆధిక్యంలో ఉన్నట్లు పేర్కొంది.

సీఎన్బీసీఆల్ అమెరికా ఎకనామిక్ సర్వే ప్రకారం కూడా డొనాల్డ్ ట్రంప్ కమలపై ఆధిక్యంలో ఉన్నారు. ట్రంప్కు 48 శాతం మంది మొగ్గు చూపగా, కమలకు 46 శాతం మంది జైకొట్టారు. ఆగస్టులో ఈ సంస్థ చేసిన సర్వేలోనూ ట్రంపే ఆధిక్యాన్ని కనబర్చారు. ఏడు రాష్ట్రాల్లో కమలపై ట్రంప్ లీడ్లో ఉన్నారు. అన్ని ప్రధాన జాతీయ, ప్రాంతీయ పోల్‌ సంస్థలను ట్రాక్ చేసే ‘రియల్ క్లియర్ పాలిటిక్స్ సంస్థ’ ప్రకారం, హారిస్ జాతీయ స్థాయిలో ట్రంప్పై 0.3 శాతం ఆధిక్యంలో ఉన్నారు.

అరిజోనా, నెవాడా, విస్కాన్సిన్, మిచిగాన్, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియాలో ట్రంప్ 0.9శాతం ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.  అమెరికన్ ఫైనాన్షియల్ ఎక్స్ఛేంజ్, ప్రిడిక్షన్ మార్కెట్ అయిన కల్షి, హారిస్‌ కంటే ట్రంప్‌ ఆధిక్యాన్ని కనబరుస్తున్నట్లు తేల్చింది. ఎన్నికల్లోఎన్నికల్లో ట్రంప్ కు 61 శాతం విజయావకాశాలు ఉండగా, హారిస్ కు 39 శాతం అవకాశం  ఉన్నట్లు తెలిపింది.

మరోవైపు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి కమలా హారిస్పై మరోసారి విమర్శలు గుప్పించారు. కమల అధికారంలోకి వస్తే చైనా ఆమెను చిన్నపిల్ల మాదిరిగా ఆడేసుకుంటుందని ఆరోపించారు. ఓ బిగినర్తో గ్రాండ్ మాస్టర్ గేమ్ ఆడుకుంటున్నట్లు బీజింగ్ ప్రవర్తన కమల పట్ల ఉంటుందని విమర్శించారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్‌ ఓ రేడియో కార్యక్రమంలో పాల్గొంటూ ‘ఒకవేళ కమలాహారిస్‌ విజయం సాధిస్తే ఆమె చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో చర్చలు జరపాల్సి ఉంటుంది. అప్పుడు ఆమెతో జిన్‌పింగ్‌ ఎలా వ్యవహరిస్తారు?’ అని హోస్ట్ ట్రంప్ను ప్రశ్నించారు. ఓ చిన్న పిల్ల మాదిరిగా కమలను చూస్తారని ట్రంప్ బదులిచ్చారు.

మరోవంక, డొనాల్డ్‌ ట్రంప్‌ ఓ ఫాసిస్టు అని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ప్రకటించారు. ట్రంప్‌ హిట్లర్‌ నుంచి ప్రేరణ పొందాడని, ఆయన గనుక గెలిస్తే నియంతలా వ్యవహరిస్తాడని వైట్‌ హౌస్‌లో సుదీర్ఘకాలం పాటు చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా పనిచేసిన జాన్‌ కెల్లీ పేర్కొన్న మరుసటి రోజే హారిస్‌ తన రాజకీయ ప్రత్యర్థిపై ఈ వ్యాఖ్యలు చేశారు. నియంతకు ఉండాల్సిన లక్షణాలన్నీ ట్రంప్‌లో పరిపూర్ణంగా ఉన్నాయని హరీష్ స్పష్టం చేశారు.

డొనాల్డ్‌ ట్రంప్‌ ఫాసిస్టు అని మీరు నమ్ముతున్నారా? అని సిఎన్‌ఎన్‌ ప్రతినిధి అడిగినప్పుడు, అవును ఆయన ఫాసిస్టే అని చెప్పారు. ట్రంప్‌ చేస్తును గందరగోళ ప్రసంగాలు, తెంపరితనం ఇవనీు ఆయన నిలకడలేనితనాన్ని తెలియజేస్తున్నాయి. ఇటువంటి వ్యక్తి మళ్లీ అధ్యక్షుడు కావడానికి పూర్తిగా అనర్హుడు అని హారిస్‌ స్పష్టం చేశారు.