దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. పొరుగు రాష్ట్రాల్లో వ్యర్థాలను తగలబెట్టడానికి తోడు పొగమంచు రాజధాని ప్రాంతాన్ని కమ్మేయడంతో రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. రాజధానిలో మాత్రమే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతోంది.
ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. శీతాకాలం, పండుగలు సమీపిస్తుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ మేరకు వివిధ రాష్ట్రాల్లోని వైద్య ఆరోగ్య శాఖలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది. వాయు కాలుష్యం తీవ్రతరం అవుతోందని.. ఇది అనారోగ్య పరిస్థితులకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.
బహిరంగ ప్రదేశాల్లో వాకింగ్‌కు వెళ్లడం, ఆటలు ఆడటం వంటి వాటికి ప్రజలు దూరంగా ఉండాలని తెలిపింది. ముఖ్యంగా గర్భిణి స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, ట్రాఫిక్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అంతేకాకుండా పంట వ్యర్థాలను తగలపెట్టడం, పండగ సమయంలో బాణాసంచా కాల్చడం వంటివి తగ్గిచడం అతిముఖ్యమైన చర్యలుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ప్రభుత్వ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు గాలి నాణ్యతను పర్యవేక్షించాలని సూచించింది. శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు కాలుష్యానికి దూరంగా ఉండాలని.. అలాంటివారు బహిరంగ ప్రదేశాల్లో తిరగడం తగ్గించాలని పేర్కొంది. ‘వాతావరణ మార్పు – మానవులపై ప్రభావం’ జాతీయ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది.
More Stories
కశ్మీర్ లోని 119 మందిఉగ్రవాదుల్లో పాక్వాసులే అధికం
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ
ఇండ్లను కూల్చడం రాజ్యాంగ వ్యతిరేకం