
బ్రిక్స్ సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బుధవారం ద్వైపాక్షిక చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అభివృద్ధికి సంబంధించిన సవాళ్లను ఎదుర్కోవడంలో, అలాగే కమ్యూనికేషన్స్ రంగంలో వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత్, చైనా నేతలిరువురూ అంగీకరించారు. 2019 తర్వాత (అర్థ దశాబ్దం) ఇరువురి నేతల మధ్య ద్వైపాక్షిక భేటీ జరగడం ఇదే మొదటిసారి.
ద్వైపాక్షిక సంబంధాలలో హెచ్చు తగ్గులున్నప్పటికీ ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలు ఆశాజనకంగానే కొనసాగాయి. ఎగుమతులతో పోలిస్తే చైనాపై భారత్ దిగుమతులపై ఆధారపడటం అధికంగా ఉంది. అయితే దాదాపు దశాబ్దానికి పైగా భారతదేశ మొదటి రెండు వాణిజ్య భాగస్వాములలో చైనా ఉంది.
ప్రభుత్వ సమాచారం పకారం దశాబ్దం క్రితం 60.4 బిలియన్ డాలర్లతో పోలిస్త, 2023-24 ఆర్థిక సంవత్సరంలో చైనా నుండి దిగుమతులు అత్యధికంగా పెరుగుతూ 101.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. చైనా నుండి దిగుమతుల వాటా ఆర్థిక సంవత్సరం 2015లో 18 శాతం నుండి 2024 ఆర్థిక సంవత్సరంలో 15 శాతానికి పడిపోయింది.
అదే సమయంలో ఎగుమతులు నెమ్మదిగా వృద్ధి చెంది 2015లో దాదాపు 12 బిలియన్ డాలర్ల నుండి 2024లో 16.67 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత దశాబ్ద కాలంలో చైనాకు ఎగుమతుల వాటా 3.8 శాతం వద్ద నిలిచింది. ఫలితంగా, వాణిజ్య సమతౌల్యం చైనాకు అనుకూలంగా కొనసాగింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 85 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
చైనా నుండి విదేశీ పెట్టుబడులు బలంగా లేవి కూడా డేటా పేర్కొంది. 2024 ఏడాదిలో మొదటి ఆరు నెలల్లో చైనా నుండి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ)ల ఈ క్విటీ 3.09 మిలియన్ డాలర్లగా ఉంది. మొత్తం ఇన్‌ఫ్లోలో కేవలం 0.01 శాతం మాత్రమే. ఎఫ్‌డిఐ ఈక్విటీ ఇన్‌ఫ్లోలు 2000 ఏప్రిల్ నుండి 2024 జూన్ మధ్య 0.36 శాతం వాటాతో 2.5 బిలియన్ డాలర్లుగా నిలిచింది.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు