విద్యుత్ పంపిణీ సంస్థల వార్షిక ఆదాయ వనరులపై విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ చేపట్టింది. ఉత్పత్తి సంస్థల నుంచి కొంటున్న కరెంట్కు, వినియోగదారులకు పంపిణీ చేస్తున్న విద్యుత్కు భారీగా లోటు ఉందని వాటిని పూడ్చుకునేందుకు చార్జీలు పెంచుకునేందుకు స్వల్పంగా అవకాశం ఇవ్వాలని డిస్కంలు ఈఆర్సీ ఎదుట పిటిషన్ దాఖలు చేశాయి.
ఇందులో ఛార్జీల పెంచడం ద్వారా రూ.1,200 కోట్లు సమకూరితే, మిగిలిన 13,022 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ రూపంలో అందుతుందని ఈఆర్సీకి నివేదించాయి. ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ, సంస్థ ఇతర ఉన్నతాధికారులు ఈ బహిరంగ విచారణకు హాజరయ్యారు.
అయితే, విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని, ఎల్.టి, హెచ్.టీ వినియోగదారుల నుంచి ఫిక్స్డ్ ఛార్జీల రూపేణా వసూలు చేసే వెసులుబాటు కల్పించాలని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తరుఫున వాదనలు వినిపించిన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఛార్జీలు పెంచకూడదని పేర్కొన్నారు.
బహిరంగ విచారణలో వివిధ రంగాలకు చెందిన విద్యుత్ రంగ నిపుణులు, వ్యాపారవేత్తలు, వినియోగదారులు, రైతులు, రాజకీయ నేతలు సైతం కమిషన్ ఎదుట హాజరై తమ వాదనలు వినిపించారు. విద్యుత్ డిమాండ్ను కావాలని అధికంగా చూపెడుతున్నారని విద్యుత్ రంగ నిపుణుడు వేణు గోపాల్రావు అందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు వాస్తవ రెవెన్యూ గ్యాప్ రూ. 5,958 కోట్లు ఉంటుందని ఎస్పీడీసీఎల్ అంచనా వేస్తోంది. రాబోయే అక్టోబర్- మార్చి మాసాల్లో ప్రతిపాదిత ఫిక్స్డ్ ఛార్జీల ద్వారా రూ. 1,028 కోట్లు వస్తోందని ఎస్పీడీసీఎల్ భావిస్తోంది. వీటిలో ఎల్.టీ వినియోగదారుల నుంచి ఫిక్స్డ్ ఛార్జీల రూపంలో రూ. 328 కోట్లు, హెచ్.టీ వినియోగదారుల నుంచి రూ. 94 కోట్లు, హెచ్.టీ వినియోగదారులకు పెంచిన ఎనర్జీ ఛార్జీల రూపేణా రూ.606 కోట్లు సమకూరే అవకాశం ఉందని డిస్కంలు భావిస్తున్నాయి.
More Stories
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
చెన్నమనేని జర్మనీ పౌరుడే…తేల్చిచెప్పిన హైకోర్టు
మోహన్ బాబు కుటుంభంలో ఆస్తుల విషయమై ఘర్షణ?