ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందే విషయంలో భారత్‌కు రష్యా మరోసారి మద్దతుగా నిలిచింది. భారత్, బ్రెజిల్‌తోపాటు ఆఫ్రికా దేశాలకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉండాలని రష్యా మరోసారి స్పష్టం చేసింది.
“భారత్, బ్రెజిల్‌తోపాటు ఆఫ్రికా దేశాల ప్రతినిధులు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత ప్రాతిపదికన ప్రాతినిధ్యం ఉండాలి. మెజార్టీ వర్గం తరఫున ప్రాతినిధ్యం ఉండేలా చూసుకోవడం ఎంతో అవసరం” అని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చెప్పారు. స్థానిక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు అవసరమని భారత్ ఎప్పటి నుంచో వాదిస్తోంది. సమకాలీన భౌగోళిక రాజకీయ పరిణామాలను ఐరాసలో ప్రతిబింబించడం లేదని ఉద్ఘాటిస్తోంది. ఈ క్రమంలో శాశ్వత సభ్యత్వానికి అర్హమైన దేశమని భారత్ చేస్తున్న వాదనతో అగ్రదేశాలు కూడా ఏకీభవిస్తున్నాయి.
భారత్ ప్రాతినిధ్యం కోసం ప్రపంచ దేశాల నుంచి మద్దతు పెరుగుతుండగా కేవలం చైనా మాత్రం దీన్ని వ్యతిరేకిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఇప్పటికే భారత్‌కు మద్దతుగా నిలవగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని తెలిపారు. ప్రస్తుతం భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనాలు శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి.
More Stories
పౌరసత్వ జన్మహక్కును తొలిగించే ఆలోచనలో ట్రంప్
సిరియా నుంచి 75 మంది భారతీయుల తరలింపు
చైనా- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధంలో విజేతలు ఉండరు