తెలంగాణ– ఏపీని కలిపే కీలకమైన జాతీయ రహదారి (ఎన్‌హెచ్)– 565 విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నల్గొండ టౌన్ బైపాస్ కు సంబంధించిన నాలుగు లైన్ల రహదారి నకిరేకల్ నుంచి నాగార్జున సాగర్ సెక్షన్ వరకు కలిపే 14 కిలో మీటర్ల నేషనల్ హైవే మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తెలంగాణలో ఎన్ హెచ్– 565లోని నకిరేకల్ నుండి నాగార్జున సాగర్ సెక్షన్ వరకు నల్గొండ టౌన్ కోసం 14 కిలో మీటర్ల పొడవు… 4-లేన్ బైపాస్ నిర్మాణానికి రూ. 516 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎన్ హెచ్ –565 తెలంగాణ– ఏపీలను కలిపే కీలకమైన జాతీయ రహదారిగా వెల్లడించారు.
ఈ మార్గంలో తెలంగాణలోని నకిరేకల్ వద్ద ఉన్న ఎన్ హెచ్– 65 జంక్షన్ నుండి ప్రారంభమై నల్గొండ– మాచర్ల– ఎర్రగొండపాలెం – కనిగిరి పట్టణాల మీదుగా వెళుతుందని వివరించారు. ప్రస్తుతం నల్గొండ టౌన్ భారీ ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందికి గురవుతుందని, దీని వల్ల పెద్ద ఎత్తున ప్రయాణీకులు అవస్తలు పడాల్సి వవస్తుందని తెలిపారు. అయితే కేంద్ర తీసుకున్న ఈ కొత్త ప్రాజెక్ట్ నల్గొండలో ట్రాఫిక్‌ను తగ్గించడమే కాకుండా, నకిరేకల్ – నాగార్జున సాగర్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని వెల్లడించారు. అలాగే రహదారి భద్రతను పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
More Stories
స్వస్థత పేరుతో చర్చిలో ప్రార్థనలతో ఓ బాలిక బలి
ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు
పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్