కేరళ తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి ఆర్. శ్రీలేఖ బుధవారం బీజేపీలో చేరారు. కేరళ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ డైరెక్టర్ జనరల్‌గా 2020లో పదవీ విరమణ చేసిన శ్రీలేఖ, రచయిత్రి కూడా. కేరళలో డిజిపి ర్యాంక్‌లో పనిచేసిన మొదటి మహిళా ఐపీఎస్ అధికారి కూడా.
బీజేపీలో చేరిన తర్వాత శ్రీలేఖ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ చరిష్మా వల్లే తాను పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. ‘‘బీజేపీ సిద్ధాంతాలపై నాకు నమ్మకం ఉంది. మూడు వారాల ఆలోచన తర్వాత బీజేపీలో చేరుతున్నాను. మూడు వారాల క్రితమే పార్టీలో చేరాలని కోరుతూ బీజేపీ నన్ను సంప్రదించింది” అని ఆమె తెలిపారు.
“నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు నిష్పక్షపాత అధికారిని. కానీ పదవీ విరమణ తర్వాత, నా అనుభవం ఆధారంగా, ప్రజలకు సేవ చేయడానికి ఇది నా ఉత్తమ మార్గం అని నేను గ్రహించాను,”అని ఆమె చెప్పారు. శ్రీలేఖను “ధైర్యవంతురాలైన అధికారి”గా అభివర్ణించిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్ ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు.
ఆమె కేరళతో సుపరిచితురాలని, పోలీసు వ్యవస్థలో ఆమె అనేక సంస్కరణలు తీసుకువచ్చారని ఆయన కొనియాడారు. “ఆమె పోలీసు దళంలో మహిళల హక్కుల కోసం పోరాడారు. కేరళలో బీజేపీ పట్ల అంటరానితనం ముగిసింది” అని ఆయన చెప్పారు. ఇటీవలి సంవత్సరాలలో ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేతలతో కేరళ ఎడిజిపి ఎంఆర్ అజిత్ కుమార్ సమావేశం కావడంపై రాజకీయ దుమారం చెలరేగిన తరుణంలో శ్రీలేఖ బిజెపిలో చేరారు.
ఈ సందర్భంగా శ్రీలేఖను సురేంద్రన్ శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఆమె మెడలో బీజేప కండువా వేశారు. ఆ తర్వాత శ్రీలేఖ దంపతులకు కమలం పువ్వులను అందజేశారు. ఆ తర్వాత వారికి స్వీట్లు తినిపించారు. మాజీ డిజిపి జాకబ్ థామస్ తర్వాత పదవీ విరమణ తర్వాత బీజేపీలో చేరిన రెండవ మాజీ ఐపిఎస్ అధికారి ఆమె. ఫిబ్రవరి 2021లో బీజేపీలో చేరిన తర్వాత, జాకబ్ థామస్ ఇరింజలకుడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేశారు. సిపిఎం అభ్యర్థి ఆర్. బిందు చేతిలో ఓడిపోయారు.
1987 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిణి శ్రీలేఖకు కెరీర్ చివరిలో కేరళలోని సీపీఎం ప్రభుత్వంతో సంబంధాలు చెడిపోయాయి. ఆమె తన పదవీ విరమణ రోజున డిజిపి స్థాయి అధికారికి ఇచ్చే అధికారిక వీడ్కోలు పార్టీకి, గౌరవ గౌరవానికి దూరంగా ఉన్నారు. తిరువనంతపురంకు చెందిన ఆమె సివిల్ సర్వీస్‌లో చేరకముందు కాలేజీ లెక్చరర్‌గా, బ్యాంక్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆ
ఆమె వివిధ జిల్లాల్లో ఎస్పీగా, ఆ తర్వాత డీఐజీగా, ఐజీగా పనిచేశారు. కేంద్ర డిప్యూటేషన్‌లో ఉన్న సమయంలో ఆమె సీబీఐలో నాలుగేళ్లపాటు పనిచేశారు. ఆమె తొమ్మిది పుస్తకాలను కూడా రచించారు.
More Stories
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
భగవద్గీతలోని సర్వకాలీన విజ్ఞానం
అమెరికా చదువులపై భారత విద్యార్థుల అనాసక్తి