వైసీపీ కీలక ఎంపీలు కొందరు ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారని, త్వరలోనే వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరుతారని సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్, బిజెపి నేత కాశీ విశ్వనాథరాజు వెల్లడించారు. ఇప్పటికే ఆ పార్టీకి ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారని గుర్తుచేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌పై జగన్ హయాంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్‌కి తీవ్ర అన్యాయం జరిగిందని చెబుతూ సమస్య పరిష్కారానికి జగన్ ఎటువంటి చొరవ చూపలేదని కాశీ విశ్వనాథరాజు మండిపడ్డారు.
‘‘స్టీల్ ప్లాంట్ ను తీసేసి అక్కడ భూముల్లో రాజధాని పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు స్టీల్ ప్లాంట్ ను టెకోవర్ చేసుకోవాలని, రియల్ ఎస్టేట్ చేయాలని చూశారు” అని ఆయన ఆరోపించారు.
అయితే, స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని చెబుతూ స్టీల్ ప్లాంట్ అంశంపై మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక, ఉక్కు శాఖ మంత్రులను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలవనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సానుకూలమైన నిర్ణయం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను సెయిల్‌లో కలిపితేనే శాశ్వత పరిష్కరం దొరుకుంతుంది ఆయన చెప్పారు. త్వరలో విశాఖ ఉక్కు కార్మికులకు మంచి రోజులు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, తిరుపతి లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు విచారణ కమిటీ వేయడాన్ని ఆయన స్వాగతించారు. తిరుపతికి అన్యమతస్తులు ఎవరు వచ్చిన స్వామి వారి మీద విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. గతంలో సోనియా గాంధీ, అబ్దుల్ కలాం కూడా ఇచ్చారని కాశీ విశ్వనాథరాజు తెలిపారు.
More Stories
ఏపీ ఏకైక రాజధాని అమరావతి మాత్రమే
సరుకు రవాణాలో విశాఖ పోర్టు సరికొత్త రికార్డు
బంగ్లాదేశ్ ఉదంతంలో పౌర సమాజం స్పందించాలి