
జమ్ముకశ్మీర్‌లో కాంగ్రెస్, ఎన్సీ కూటమి, హర్యానాలో బిజెపి ఆధిక్యంలో దూసుకెళ్తున్నాయి. మొత్తం 90 స్థాలకు గాను కాంగ్రెస్ కూటమి 50 చోట్ల లీడ్‌లో ఉండగా, బీజేపీ 27 సీట్లలో ముందంజలో ఉన్నది. ఇక పీడీపీ 4, ఇతరులు 9 చోట్లు ఆధిక్యంలో ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 48 చోట్ల విజయం సాధించాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ కూటమిలో.. నేషనల్ కాన్ఫరెన్స్ 56 చోట్ల పోటీచేయగా 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. ఇక కాంగ్రెస్ పార్టీ 39కి గాను 9 స్థానాల్లో, సీపీఎం 1, జేకేఎన్‌పీపీఐ 4 చోట్ల పోటీచేయగా 1 సీటులో లీడ్‌లో ఉంది. మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా పోటీచేసిన రెండు చోట్ల లీడ్‌లో ఉండగా, మెహబూబా ముఫ్తీ కూడా రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతున్నా బిజెపి ఆధిక్యంలో ముందుకెడుతున్నది. తొలుత కాంగ్రెస్ 60కు పైగా సీట్లలో ఆధిక్యంలో ఉన్నప్పటికీ క్రమంగా ఆ సంఖ్య 36కు తగ్గిపోయింది. బీజేపీకి 47 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది.
ఇక్కడ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. ఫలితాల సరళి క్షణక్షణానికి మారుతోంది. తొలుత ఇక్కడ హస్తం పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్లింది. రాష్ట్రంలోని 90 సీట్లలో 63 చోట్ల ముందంజలో కొనసాగగా.. బీజేపీ 23 స్థానాలకు పరిమితమైంది.
మొదట కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చగా.. ఆ తర్వాత కొంచెం వెనుకబడింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ ఆధిక్యాన్ని చూపించింది. దీంతో ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు స్పష్టమవుతోంది. జమ్మూ, కశ్మీర్‌లో హంగ్ వచ్చే అవకాశం ఉందని, హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం పక్కా అంటూ అనేక సర్వే సంస్థలు అంచనా వేశాయి.
ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ జమ్మూ కశ్మీర్‌లో ఎన్సీ, కాంగ్రెస్ కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్సీ-కాంగ్రెస్ కూటమి 50కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉంది.
More Stories
శతాబ్ది ఉత్సవాల్లో ప్రతి గ్రామంకు, ప్రతి ఇంటికి ఆర్ఎస్ఎస్
ఆపరేషన్ సిందూర్ తో రక్షణ ఉత్పత్తులకు డిమాండ్
మళ్లీ బుల్లి తెరపై తులసీగా స్మృతి ఇరానీ