విశాఖ ఉక్కు కాపాడుకుందాం

విశాఖ ఉక్కు కాపాడుకుందాం

విశాఖ స్టీలు ప్లాంటు ఏర్పాటు కోసం చేసిన త్యాగాలను మరిచిపోవద్దని, పరిశ్రమను కాపాడుకోవాలనే భావోద్వేగం కార్మికులు, ఉద్యోగులు, వారి సంఘాల్లో ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఆదివారం ఉదయం విశాఖ స్టీలు ప్లాంటు కార్మిక సంఘాల నాయకులు క్యాంపు కార్యాలయంలో ఆయనతో సమావేశమయ్యారు. విశాఖ ప్లాంటు ప్రైవేటీకరణ కాకుండా ఆపాలని వారు కోరారు.

12,500 మంది ఉద్యోగులు, 14 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారని చెప్పారు. పరిశ్రమను కాపాడుకునేందుకు ఉద్యోగులు, కార్మికులు, భూ నిర్వాసితులు తెలిపిన ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళతామని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ప్లాంటును ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు కేంద్రంతో మాట్లాడామని చెప్పారు. అప్పట్లోనే కేంద్రం వద్దకు అఖిలపక్షం వెళ్లి వినతి ఇద్దామని కోరితే పలువురు స్పందించలేదని అన్నారు.

’32 మంది బలిదానాలు, 16 వేల మంది నిర్వాసితుల త్యాగాలు, 24 వేల ఎకరాలు భూ సేకరణతో ఏర్పాటైన పరిశ్రమ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌. ఈ పరిశ్రమ కోసం అంతమంది చేసిన త్యాగాలను ఎవరూ మరచిపోకూడదు. వారి త్యాగాలతో ఏర్పడిన పరిశ్రమను కాపాడుకోవాలనే భావోద్వేగం ప్లాంట్‌లో పనిచేసే ప్రతి ఒక్కరితోపాటు కార్మిక, ఉద్యోగ సంఘాల నేతల్లో కూడా ఉండాలి’ అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

అదేవిధంగా మన వైపు నుంచి ఉన్న ఇబ్బందులను కూడా మనం తెలుసుకొని సరిదిద్దుకోవాలి” అని సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసే వివరాలపై వారితో చర్చించి నివేదికను రూపొందించారు. ఈ సందర్భంగా డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ను ప్రయివేటీకరణ కాకుండా ఎలా కాపాడింది వివరించారు.  ఈ సందర్భంగా చర్చల్లో పవన్‌ కల్యాణ్‌ కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడుతూ ‘నాటి ముఖ్యమంత్రి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ భూములు అమ్మేద్దామని మీ ముందు ప్రతిపాదించిన మాట నిజమేనా?’ అని అడిగారు. ఆ ప్రతిపాదన వాస్తవమే అని ఆ నేతలు తెలిపారు.

విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ఉన్న ముఖ్య ప్రతిపాదనలపై కార్మిక సంఘాల నేతలతో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చర్చించారు. ఈ సందర్భంగా 4 ముఖ్య ప్రతిపాదనలను తెలిపారు.

  1. విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలి. వర్కింగ్‌ క్యాపిటల్‌ సమకూర్చాలి. లేదా
  2. సెయిల్‌లో విలీనం చేయడం. లేదా
  3. ఎన్‌ఎండీసీ, నగర్‌ నార్‌ స్టీల్స్‌లో విశాక ఉక్కును విలీనం చేయాలి.
  4. నాన్‌ స్ట్రాటజిక్‌ ప్లాన్‌ నుంచి స్ట్రాటజిక్‌ ప్లాన్‌ పరిధిలోకి విశాఖ ఉక్కును తీసుకోవాలి.