బతుకమ్మ సంబుర ప్రాశస్త్యాన్ని, పండగలోని పరమార్థాన్ని అమెరికాలో పలు రాష్ట్రాలు గుర్తించాయి. అమెరికాలోని నార్త్ కరోలినా, జార్జియా, వర్జీనియా రాష్ట్రాలు.. బతుకమ్మ పండుగకు అధికారికంగా గుర్తించాయి. అంతేకాదు.. బతుకమ్మ సంబరాల వారాన్ని.. బతుకమ్మ పండగ వారంగా, తెలంగాణ హెరిటేజ్ వీక్‌గా ప్రకటించాయి కూడా. ఈ మేరకు.. ఆయా స్టేట్ల గవర్నర్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో.. బతుకమ్మ పండుగ ప్రశస్త్యం ఖండాంతరాలు దాటినట్టయింది.
బతుకమ్మ పండుగ అనేది ఎంతో ప్రత్యేకమైన, ప్రాముఖ్యత ఉన్న పండుగల్లో ఒకటని.. ఈ ఉత్సవాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజలే కాకుండా అమెరికాలో స్థిరపడ్డ 12 లక్షల మంది ఎన్నారైలు కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని జార్జియా, వర్జీనియా రాష్ట్రాల గవర్నర్లతో పాటు నార్త్ కరోలినాలోని ఛార్లెట్, రాలేహ్ మేయర్లలు అభివర్ణించారు.
ఇప్పటికే.. తెలంగాణలోని ప్రజలు విశ్వవ్యాప్తంగా విస్తరించారు. అమెరికా, లండన్, బ్రిటన్, పారిస్, దుబాయి, సౌదీ అరేబియా ఇలా అన్ని దేశాల్లో తెలంగాణవాసులు స్థిరపడ్డారు. అయితే.. తెలుగు వారు ఎక్కడున్నా వారి సంస్కృతిని సంప్రదాయాలను ఎప్పుడూ మర్చిపోకుండా పాటిస్తుంటారు. ఈ క్రమంలోనే.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజలు కూడా.. బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తుంటారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత.. బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తమైంది. ముఖ్యంగా తెలంగాణ జాగృతితో పాటు తానా, మాటా లాంటి తెలుగు ఎన్నారైల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్గనైజేషన్స్ కూడా ఆయా దేశాల్లో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ వేడుకలకు అక్కడ నివసిస్తున్న తెలుగువారి నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో.. అక్కడి ప్రభుత్వాలు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవటం గమనార్హం.
More Stories
బంగ్లా హిందువుల రక్షణకై భారత్ నిర్దిష్ట చర్యలు అవసరం
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై హింస, అణచివేతలపై నిరసన
పౌరసత్వ జన్మహక్కును తొలిగించే ఆలోచనలో ట్రంప్