
సిరియాలో అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్‌ఖైదాకు చెందిన 37 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పలు ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. వాయువ్య సిరియాపై దాడి చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది.
ఇందులో అల్‌ఖైదాతో అనుబంధం ఉన్న హుర్రాస్ అల్ దిన్ గ్రూప్ అగ్రనేతతో పాటు మరో ఎనిమిదిపై దాడి చేసినట్లు జరిగినట్లు తెలిపింది. టాప్ ఉగ్రవాది స్థానిక ఉగ్రవాద కార్యకలాపాలకు పర్యవేక్షిస్తుంటాడని చెప్పింది. అలాగే ఈ నెల 16న సెంట్రల్ సిరియాలోని మారుమూల అజ్ఞాత ప్రదేశంలో ఉన్న ఐఎస్ శిక్షణా శిబిరంపై పెద్దయెత్తున వైమానిక దాడులు చేసినట్టు తెలిపింది.
ఆ దాడిలో నలుగురు సీనియర్ నేతలు సహా 28 మంది తీవ్రవాదులు మరణించినట్టు పేర్కొన్నది. . అమెరికా ప్రయోజనాలతో పాటు మిత్రదేశాలు, భాగస్వాములకు వ్యతిరేకంగా కార్యకలాపాలను అడ్డుకునేందుకు వైమానిక దాడి నిర్వహించినట్లు చెప్పుకొచ్చింది.
దాదాపు 900 మంది అమెరికా సైనికులను సిరియాలో అమెరికా మోహరించింది. యూఎస్ దళాలు ఈశాన్య సిరియాలోని కుర్దిష్ నేతృత్వంలోని సిరియన్ డెమోక్రటిక్ దళాలకు సలహాలు ఇవ్వడంతో పాటు సహాయం చేయనున్నాయి. ఇప్పటికే గాజా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు దిగుతున్నది.
దీంతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్, ఇజ్బొల్లాను అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నది. తాజాగా అమెరికా సైతం సిరియాపై దాడి చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్లకు భారత్ హెచ్చరిక