శ్రీలంక అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకే

శ్రీలంక అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకే
మార్క్సిస్ట్ నేత అనుర కుమార దిససాయకే (56) శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వామపక్ష కూటమి అయిన పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్(జేవీపీ)కి చెందిన కుమార విజయం సాధించినట్లు శ్రీలకం ఎన్నికల కమిషన్  ప్రకటించింది. సోమవారం శ్రీలంక 9వ అధ్యక్షుడిగా దిసనాయకే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో తన ప్రత్యర్థులు ప్రేమదాస, ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేను వెనక్కు నెట్టారు. 

2019 అధ్యక్ష ఎన్నికలలో కేవలం 3 శాతం కంటే ఎక్కువ ఓట్లను పొందిన జేవీపీకి ఈ విజయం పెద్ద మలుపు. శనివారం జరిగిన ఈ ఎన్నికల్లో 76 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస 32.76 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. రణిల్ విక్రమసింఘే 17.27 శాతంతో మూడో స్థానంలో నిలిచారు.

ఆదివారం మధ్యాహ్నం వరకు జరిగిన ఫస్ట్ రౌండ్ కౌంటింగ్లో ఏ అభ్యర్థికీ మెజారిటీ ఓట్లు రాలేదు. దీంతో శ్రీలంక ఎన్నికల చరిత్రలో తొలిసారి కౌంటింగ్ రెండో రౌండ్లోకి చేరింది. విజేతగా ప్రకటించాలంటే అభ్యర్థికి 50శాతం కన్నా ఎక్కువ ఓట్లు రావాలి. సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి శ్రీలంక రెండో అధ్యక్షుడు అయ్యారు. ఆయన తండ్రి వ్యవసాయ కూలీ.
 
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన మార్క్సిస్టు నేత అనురా కుమార డిస్సనాయకే జాతి ఐక్యతకు పిలుపునిచ్చారు. శ్రీలంక నూతన శకం ప్రారంభంలో సింహళులు, తమిళులు, ముస్లింలతో కూడి శ్రీలంకన్ల ఐక్యత ఉంటుందని పేర్కొన్నారు.  దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేందుకు నూతన శకం ప్రారంభం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నూతన పునర్జీవనం కోసం కృషి చేస్తా’ అని పేర్కొన్నారు. 
 
“మనందరి శతాబ్దాల కల ఎట్టకేలకు సాకారమవుతుంది. ఈ విజయం ఏ ఒక్కరి కష్టం కాదు, వందల వేల మంది సమష్టి కృషి. ఈ విజయం మనందరిది. ఎందరో కన్నీళ్లు, ప్రాణ త్యాగాలతో మన ప్రయాణం సాగింది. వాళ్ల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి. లక్షలాది కళ్లు ఎన్నో ఆశలతో నిండిపోయాయి. శ్రీలంక చరిత్రను తిరగరాయడానికి మేం సిద్ధంగా ఉన్నాం” అని ఎన్పీపీ నాయకుడు అనుర కుమార దిసానాయకే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
 
శనివారం జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో డిస్సనాయకే (55)కు 42.31 శాతం ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస నిలిస్తే, ప్రస్తుత అధ్యక్షుడు విక్రమసింఘే మూడో స్థానానికి పరిమితం కావడం గమనార్హం. కాగా, శ్రీలంకలో రాజకీయంగా ప్రాబల్యం ఉన్న రాజపక్స కుటుంబంపై ప్రజలు పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయారు. గత 20 ఏళ్లుగా పార్లమెంట్‌లో ఉన్న దిసనాయకేపై శ్రీలంక ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.
 
శనివారం జరిగిన ఎన్నికల్లో 22 జిల్లాల పరిధిలోని 13,400కి పైగా పోలింగ్ కేంద్రాల్లో 1.70 కోట్ల మంది ఓటర్లలో 75 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొత్తగా దేశాధ్యక్షుడిగా ఎన్నికైన డిస్సనాయకే ప్రభుత్వం.. శ్రీలంకకు ఐఎంఎఫ్ ఇచ్చిన 2.9 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీ నిబంధనల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019 అధ్యక్ష ఎన్నికలలో కేవలం 3 శాతం కంటే ఎక్కువ ఓట్లను పొందిన జేవీపీకి ఈ విజయం పెద్ద మలుపు.