
కాగా, ఆ ఆరోపణలకు టీడీపీ ఆధారాలు బయటపెట్టింది. తిరుపతి లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిని పరీక్షించిన వివిధ ల్యాబ్‌ల నివేదికలను టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి మీడియాకు విడుదల చేశారు. ఆ రిపోర్టుల్లో టీటీడీకి కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్న నెయ్యిలో కేవలం 19 శాతం మాత్రమే నెయ్యి ఉన్నట్లు తేలింది.
టీటీడీకి సరఫరా అయ్యే నెయ్యిని దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఎన్‌డిడిబి క్యాల్ఫ్ ల్యాబ్‌లో పరీక్షించారు. కాగా, ఆ రిపోర్ట్ ప్రకారం, నెయ్యిలో సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతో పాటు చేప నూనె, బీఫ్ టాలో, పామాయిల్, పంది కొవ్వును కూడా వాడినట్లు తేలింది.
వైసీపీ హయాంలో నెయ్యి, జీడిపప్పు, బాదంపప్పు ఇతర పదార్థాలు నాసిరకం ఉపయోగించారు. దాంతో లడ్డూల్లో నాణ్యత లోపించింది. కర్ణాటకకు చెందిన నందిని కో-ఆపరేటివ్ డెయిరీ రాయితీతో నెయ్యి సరఫరా చేసేది. నందిని సంస్థ నెయ్యి సరఫరా చేస్తే కమిషన్లు రావనే ఉద్దేశంతో ఆ సంస్థను గత పాలకులు పక్కన పెట్టారు.
టీటీడీ ఉపయగించిన నెయ్యిలో సోయాబిన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తిగింజలతోపాటు చేప నూనె వాడినట్లు స్పష్టమైంది. బీఫ్ టాలో పామాయిల్, పంది కొవ్వు కూడా వాడారు. ఇందులో ఎస్ వ్యాల్యూ ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉంది . 95.68 నుంచి 104.32కు ఉండాల్సిన ఎస్ వ్యాల్యూ 20.32 ఉండడానికి కారణం జంతువుల కొవ్వు కలవడమేనని ల్యాబ్ నిర్ధారించింది. నెయ్యి నాణ్యతను కూడా పరిశీలించకుండా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా లడ్డూల వినియోగానికి ఉపయోగించింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యతను పరిశీలించడానికి ల్యాబ్‌కు పంపించగా వచ్చిన నివేదికలో వివిధ రకాల నూనెలు, కూరగాయల నుంచి తీసిన నూనె అందులో ఉందని నిర్ధారణ అయ్యింది. తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ సప్లయ్ చేసిన నేతిని ల్యాబ్‌కు పంపితే అందులో వెజిటబుల్ ఆయిల్ ఉందని పేర్కొన్నారు. ఆ సంస్థను టీటీడీ బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది.
More Stories
ఆఫ్ఘన్ భూభాగాన్ని మరో దేశంకు వ్యతిరేకంగా అనుమతించం!
మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి
ఆంగ్లేయుల గురించి ఏనాడూ భ్రమలు లేవు, రాజీ పడింది లేదు