జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఇటీవల ఆయన అసిస్టెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వేధింపులు 2019 నుంచి ఉన్నాయని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
‘2017లో జానీ మాస్టర్ పరిచయం అయ్యారు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరి, అదే ఏడాది ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం అక్కడికి వెళ్లాను. తనతో పాటు మరో ఇద్దరు సహాయకులం వెళ్లాం. అక్కడ హోటల్లో నాపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే మరి డ్యాన్స్ చేయవని బెదిరించాడు. సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని లొంగదీసుకున్నాడు’ అని ఆమె తెలిపింది.
దీన్ని అవకాశంగా తీసుకుని హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లినప్పుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె వెల్లడించింది. షూటింగ్ సమయాల్లోనూ వ్యానిటీ వ్యాన్లో అసభ్యంగా ప్రవర్తించేవాడని అంటూ ఆయన వేధింపులు భరించలేకే జానీ మాస్టర్ బృందం నుంచి బయటకొచ్చేశానని వివరించింది.
అయినా తన పని చేసుకోకుండా అడ్డు పడుతున్నారు. ఇతర ప్రాజెక్టులు రాకుండా చేస్తున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలానే షూటింగ్ టైంలోనూ అందరి ముందు తనని అసభ్యంగా తాకేవాడని, జానీ మాస్టర్ భార్య కూడా తనని మతం మార్చుకుని, అతడిని పెళ్లి చేసుకోవాలని చాలా ఇబ్బంది పెట్టిందని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ఈ మేరకు బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును నార్సింగికి రాయదుర్గం పోలీసులు బదిలీ చేశారు.
More Stories
కాంగ్రెస్ మహిళా వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనం
మూసీ బాధితులు రేవంత్ ను మెచ్చుకుంటే రాజకీయాలకు స్వస్తి!
ఎమ్మెల్యేల అనర్హతపై స్టేకు హైకోర్టు తిరస్కారం