
ఏపీ పంచాయతీ రాజ్ శాఖ అరుదైన ఘనత సాధించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని పంచాయతీ రాజ్ శాఖ ఒకేరోజు 13,326 గ్రామసభల నిర్వహణతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. పంచాయతీరాజ్ శాఖకు వరల్డ్ రికార్డు యూనియన్ గుర్తింపు లభించింది. ఈ రికార్డు సర్టిఫికెట్ ను పవన్ కల్యాణ్ కు అందజేశారు.
గ్రామ స్వరాజ్యం దిశగా ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజులలోపే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డు సాధించింది. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 23వ తేదీన నిర్వహించిన గ్రామ సభలను గుర్తించింది.
ఇందుకు సంబంధించిన రికార్డు సర్టిఫికెట్, మెడల్ ను పవన్ కల్యాణ్ కు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ అందచేశారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు.
గ్రామాల అభివృద్ధికి నాలుగు ప్రధాన ప్రణాళికలతో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ‘స్వర్ణ గ్రామ పంచాయతీ’ పేరుతో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో నిర్వహించే గ్రామసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనగా, అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లె గ్రామసభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ గ్రామ సభల్ని సర్పంచి అధ్యక్షతన నిర్వహించారు.
గ్రామసభ కార్యక్రమానికి ప్రపంచ స్థాయి గుర్తింపు అందుకోవడం ఆనందంగా ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి 100 రోజుల లోపే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలకు గాను ప్రపంచ రికార్డ్ సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
More Stories
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ
ప్రభుత్వ రంగం ప్రభుత్వం చేతిలో ఉండకూడదు
జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్కు పెద్ద ఊతం