
తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను పార్టీలోని మహిళా నేతపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. నియోజక వర్గానికి చెందిన మహిళా నాయకురాలిపై ఎమ్మెల్యే పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె గురువారం సంబంధిత వీడియోలను మీడియా సమావేశంలో బయటపెట్టడంతో ఎమ్యెల్యేను సస్పెండ్ చేయక పార్టీ నాయకత్వంకు తప్పలేదు.
ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ కు ఏ విషయమై లేఖ రాశానని ఆమె తెలిపింది. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఆదిమూలం తనపై బెదిరింపులకు దిగాడని బాధితురాలు చెప్పింది. ఆదిమూలం తమ ఇంటికి వచ్చాడని ఎవ్వరూ సంబరపడి పోవద్దని, అలా వస్తే మీ భార్య, పిల్లలపై కన్నేస్తాడని ఆమె పార్టీ నాయకులను హెచ్చరించింది.
ఆదిమూలం కామాంధుడు, రాక్షసుడని ఆరోపిస్తూ అతని నుంచి సత్యవేడులోని పార్టీ మహిళా కార్యకర్తలను కాపాడాలని బాధితురాలు వేడుకొంది. గతంలో వైసిపి ఎమ్యెల్యేగా ఉన్న ఆదిమూలంను పర్యటలో చేర్చుకొని, అదే సీటు ఇవ్వడాన్ని ఈ మహిళా నాయకురాలు తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో ఎమ్యెల్యేకు వ్యతిరేకంగా పార్టీ నిర్వహించిన పలు నిరసన కార్యక్రమాలలో ఆమె చురుకుగా పాల్గొన్నారు.
అయితే పార్టీ ఆయనకే సీటు ఇవ్వడంతో ఆమె ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిమూలంతో పరిచయం ఏర్పడినట్టు ఆమె తెలిపింది. ఎన్నికల్లో ప్రచారం చేసిన సమయంలో తన మొబైల్ తీసుకుని మాట్లాడేవాడని, మొదట్లో చెల్లెమ్మా అని తనను పిలిచేవాడని బాధితురాలు పేర్కొంది.
ఎమ్మెల్యే అయ్యాక పదేపదే తనకు కాల్స్ చేసేవాడని, లైంగిక వాంఛలు తీర్చాలని వేధించినట్టు ఆరోపించింది. ఈ ఏడాది జైలు 6న తిరుపతిలోని ఓ హోటల్‌కు తనను పిలిపించి అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపించింది. ఆ విషయం బయటపెడితే తన పిల్లల్ని చంపుతానని బెదిరించాడని, ఆ తర్వాత జులై 17వ తేదీన మరోసారి తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపించారు.
ఎమ్మెల్యే ఆదిమూలం పదేపదే ఫోన్లు చేస్తుండటం వల్ల ఓ రోజు తన భర్త నిలదీయడంతో ఇంట్లో గొడవలు జరిగాయని, చివరకు తన భర్తకు విషయం చెప్పడంతో అతని సూచనతో ఆదిమూలం స్వరూపాన్ని బయటపెట్టడానికి తానే వీడియోలు చిత్రీకరించినట్టు ఆమె చెప్పారు. సత్యవేడులోని పలువురు మహిళలు తనలా అన్యాయానికి గురయ్యారని, ఆగస్టు 10వ తేదీన ఆదిమూలం తనను హోటల్‌కు పిలిచినపుడు వీడియోలు రికార్డ్ చేసినట్టు ఆమె తెలిపారు.
ఆ తర్వాత వాటిని పార్టీ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశానని ఆమె చెప్పారు. విషయం తెలియడంతో తన ఇంటికి మనుషుల్ని పంపి బెదిరింపులకు పాల్పడ్డాడని ఆమె తెలిపారు. ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసి తనను కాపాడాలని, చర్యలు తీసుకోపోతే తమకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని బాధితురాలు ఆమె వాపోయింది.
హోటల్ గదిలో దృశ్యాలను బాధిత మహిళ విడుదల చేయడంతో అవి వైరల్‌గా మారాయి. ఆదిమూలం గురించి అందరికీ తెలియాలనే పెన్ కెమెరాలో రికార్డు చేశానని ఆమె వెల్లడించింది. తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఎమ్మెల్యే 100 సార్లు కాల్ చేశాడని పేర్కొంది. రాత్రులు మెసేజ్‌లు చేసి వేధించేవాడని తెలిపింది.
More Stories
గుంటూరు ఆసుపత్రిలో జిబిఎస్ తో ఓ మహిళ మృతి
రైళ్ల పేర్లలో గందరగోళంతో ఢిల్లీలో తొక్కిసలాట!
భారతదేశ వారసులు హిందువులే