ఆకారపు కేశవరాజు
గత కొంతకాలంగా నేపాల్ ను లక్ష్యంగా చేసుకొని చైనా కమ్యూనిస్టుల ప్రభుత్వం, మరోవైపు క్రైస్తవులు, ఇంకొక వైపు పాకిస్తాన్ బంగ్లాదేశ్ రోహింగ్యా చొరబాటుదారులు చిన్న దేశం నేపాల్ లోకి వేలాదిగా రావడం, స్థానిక హిందువులను ప్రలోభాలతో ఆకర్షించి, లేదా బెదిరించి వారిని మతం మార్చి తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటున్న పరిస్థితిని గమనించిన నేపాలీ హిందువులు ఆలస్యంగా అయినా మేల్కొంటున్నారు.
ఇలా మతం మార్చడానికి వచ్చే మాయగాళ్లకు గట్టి సమాధానమే చెప్పారు. నేపాల్ లోని ‘సున్సారి జిల్లాలో’ 288 కుటుంబాలకు చెందిన 1421 మంది హిందువులను క్రైస్తవులుగా మారిన హిందువులు (ముసహర్, సదా, మెత్తా, మండల్, ఓరాన్, రామ్ (చెప్పులు కుట్టేవారు), థారూ, నాయి (క్షురకులు ), పాశ్వాన్, సర్దార్, దాస్, తత్మా) అక్కడి కులాల వారిని మాయమాటలతో తప్పుడు హామీలతో ప్రలోభాలకు గురిచేసి విదేశీ చర్చ్ క్రైస్తవులుగా మార్చింది.
నేపాల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మతం మార్చబడిన వారందరినీ ఆగస్టు 31న వేదపండితులు, సాధుసంతుల సమక్షంలో యజ్ఞం నిర్వహించి పూలవర్షం కురిపించి తిరిగి వారి స్వధర్మంలోకి స్వాగతం పలికారు. నేపాల్ దేశపు విశ్వహిందూ పరిషత్ సెక్రటరీ జితేందర్ మాట్లాడుతూ స్రృష్టిలోని సర్వప్రాణుల, ఝడచేతనాల శ్రేయస్సును కోరే వారు ఎవరూ లేరని వివిధ మతాలు, సిద్ధాంతాలు ప్రచారం చేసే వారందరూ ప్రకృతిని దోచుకోవడం కోసమే తమ అనుయాయులకు చెబుతుంటారని తెలిపారు.
అయితే, ప్రపంచంలోని ప్రతి వారి శ్రేయస్సును కోరేవారు, పంచభూతాలను గౌరవించి దేవతలుగా ఆరాధించే ప్రకృతి ఆరాధకులు కేవలం హిందువులేనని స్పష్టం చేశారు. వారి సంఖ్య తగ్గిపోతే ప్రపంచ శ్రేయస్సు కోరే వారే కరువు అవుతారని, ప్రపంచం అంతా కల్లోలమే అవుతుందని హెచ్చరించారు. హిందువుల సంఖ్య తగ్గడానికి వీల్లేదని చెబుతూ వీరి సంఖ్య పెంచడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చారు.
హిందూ దేశమైన నేపాల్ ను క్రైస్తవ దేశంగా మార్చడం కోసం కేరళ నుండి మతంమార్పిడి మాయగాళ్లు వస్తున్నారని పేర్కొంటూ వారందరినీ జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
More Stories
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?
బంగ్లాదేశ్ లో నమాజ్ సమయంలో దుర్గాపూజపై ఆంక్షలు
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ జయకేతనం