ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లను ఒక ముస్లిం మహిళ ప్రశంసించింది. దీనిపై ఆగ్రహించిన ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
మొహల్లా సరాయ్ ప్రాంతానికి చెందిన ముస్లిం మహిళకు గత ఏడాది డిసెంబర్ 13న అయోధ్యలోని మొహల్లా ఢిల్లీ దర్వాజా ప్రాంతానికి చెందిన అర్షద్‌తో వివాహం జరిగింది. కాగా, పెళ్లి తర్వాత అయోధ్యలోని అత్తవారింటికి చేరుకున్న ఆ ముస్లిం మహిళకు అక్కడి రోడ్లు, సుందరీకరణ, అభివృద్ధి, వాతావరణం ఎంతో నచ్చాయి.
దీంతో భర్త ముందు సీఎం యోగి, ప్రధాని మోదీని ఆమె ప్రశంసించింది. ఆగ్రహించిన భర్త అర్షద్ భార్యను కొట్టడంతోపాటు కాలుతున్న పాన్‌ను ఆమెపై విసిరాడు. అలాగే భార్యను పుట్టింటికి పంపేశాడు. మరోవైపు కొన్ని రోజుల తర్వాత బంధువుల జోక్యంతో ఆ మహిళ తిరిగి అయోధ్యలోని భర్త ఇంటికి చేరుకున్నది.
అనంతరం భర్త తనను కొట్టడంతోపాటు మోదీ, యోగిని ప్రశంసించినందుకు తిట్టి ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడని ఆ మహిళ ఆరోపించింది. భర్తతో పాటు అత్తింటి వారు కూడా తనను వేధించి చిత్రహింసలకు గరిచేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అర్షద్, అతడి కుటుంబ సభ్యులతో సహా 8 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
More Stories
బంగ్లా హిందువుల రక్షణకై భారత్ నిర్దిష్ట చర్యలు అవసరం
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై హింస, అణచివేతలపై నిరసన
లింగాయత్‌ల కోటా పోరుపై పోలీసుల లాఠీచార్జి