ఈ మిషన్ విజయవంతమైతే అమెరికా, పూర్వపు సోవియట్ యూనియన్, ఇటీవల చైనా తర్వాత చంద్రుడి మట్టిని తెచ్చిన దేశాల జాబితాలో భారత్ కూడా చేరుతుంది. 2028 నాటికి భారత్ సొంత అంతరిక్ష కేంద్రం మొదటి మాడ్యూల్స్ ను కూడా ప్రయోగిస్తామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ చెప్పారు. అంతరిక్షంలో కృత్రిమ ఉపగ్రహాల శిధిలాలు ఏర్పడకుండా, ఉపగ్రహ ప్రయోగాలను 2030 నాటికి చేపడ్తామని తెలిపారు.
జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి సోమనాథ్ పాల్గొన్నారు. చంద్రయాన్ -3 చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతానికి సమీపంలో విజయవంతంగా ల్యాండ్ అయిన తేదీ అయిన ఆగస్ట్ 23వ తేదీని గత సంవత్సరం జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
ఈ సందర్భంగా ఇస్రో తన కీలక శాస్త్రీయ విజయాలను బ్రిటిష్ పీర్ రివ్యూ జర్నల్ నేచర్ లో ఆగస్టు 21న ప్రచురించింది. “1969 లో మా అంతరిక్ష కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి మేము స్థిరంగా పురోగతి సాధించాము. ఇప్పుడు, 2027 లో మేము లక్ష్యంగా పెట్టుకున్న చంద్రయాన్ -4 మిషన్ సమయంలో మరిన్ని ప్రయోగాల కోసం చంద్రుడి మట్టిని తిరిగి తీసుకురావడం ద్వారా భారతదేశం తన సాఫ్ట్ ల్యాండింగ్ ను దాటి వెళ్ళాలని చూస్తోంది” అని వెల్లడించారు.
2028 నాటికి భారత అంతరిక్ష కేంద్రం మొదటి మాడ్యూల్ పై కూడా పనిచేస్తున్నామని తెలిపారు. 2030 నాటికి, మన ఉపగ్రహాలను తిరిగి భూమిపై పడేలా చూడటం ద్వారా అంతరిక్షాన్ని కలుషితం చేయకుండా చూస్తామని సోమనాథ్ చెప్పారు. చంద్రయాన్-3 యొక్క కీలక విజయాలలో ఒకటి చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతం రసాయన సమతుల్యతను పరిశీలించడమని డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్ అనుబంధ ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ డైరెక్టర్ అనిల్ ప్రభాకర్ తెలిపారు.
సౌరకుటుంబంలోనే అతి పెద్ద బిలం అయిన ఐట్కెన్ బేసిన్ ను నిశితంగా పరిశీలించిన తొలి మిషన్ ఇస్రోదేనని తెలిపారు. చంద్రుడిపై మానవ సహిత ల్యాండింగ్ చేయాలనే ప్రతిష్టాత్మక లక్ష్యం కూడా ఇస్రో ప్రాజెక్టుల జాబితాలో ఉంది. గగన్ యాన్ మిషన్ స్థిరమైన వేగంతో ముందుకు సాగుతోందని, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా 2040 నాటికి మానవ సహిత అంతరిక్ష యాత్రకు నాయకత్వం వహిస్తారని చెప్పారు. గగన్ యాన్ మొదటి మానవరహిత ట్రయల్స్ ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభమవుతాయని సోమనాథ్ తెలిపారు.
More Stories
హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీ అద్భుత విజయం
జమ్ముకశ్మీర్ తదుపరి సీఎంగా ఒమర్ అబ్దుల్లా
‘స్వర్ణాంధ్ర విజన్’ సాకారానికి సహకరించండి